బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్‌కి స్పెషల్ పవర్స్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్ బాస్ తెలుగు 5 విజయవంతంగా తొమ్మిది వారాలు పూర్తయ్యాయి. ఈ రోజుతో పదో వారంలోకి అడుగుపెట్టాం. ఈ వారం అనూహ్యంగా విశ్వ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయనను ఎలిమినేట్ చేయడంపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి సభ్యులు కూడా దీనిపై రకరకాల కామెంట్లు చేశారు. విశ్వ ఎలిమనేషన్ వ్యవహారంపైనే హౌస్ మేట్స్ చర్చించుకున్నారు. మరోసారి బిగ్‌బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్‌తో యానీ మాస్టర్ .. కాజల్, సన్నీ, మానస్, షణ్ముఖ్‌లను జైల్లో వేసింది. ఈ వ్యవహారంతో మానస్ ఫైరయ్యారు. మరి ఈ వారం నామినేషన్‌లో ఎవరెవరు వున్నారో తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూసేయాల్సిందే.
షో మొదలైన తర్వాత ఇంట్లో గేమ్ ఆడటం, టాస్క్‌ల్లో పాల్గొనడం మాత్రమే కాదు, ఇంకా ఏదో జరుగుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు హౌస్‌మేట్స్. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో తెలియదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. షణ్ముఖ్, సిరిలపై మానస్ ఓ షాకింగ్ కామెంట్ చేశాడు. రవిని టచ్ చేయాలంటే విశ్వని దాటుకుని వెళ్లాలి... విశ్వ- రవికి ఓ బాడీగార్డ్ లాగా పనిచేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవి, షణ్ముఖ్‌ల మధ్య ఇదే డిష్కషన్ జరిగింది. ఒకవేళ ప్రియాంక వెళ్లిపోతే మానస్ పరిస్థితేంటి అని షణ్ముఖ్ అడగ్గా.. రవి స్పందిస్తూ సన్నీని చూసుకుంటాడులే, వాళ్లిద్దరూ అలానే ఉంటారు కదా అంటూ కామెంట్ చేశాడు.
అనంతరం ఎవరైనా నలుగురు కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేసి జైలులో పెట్టాలని కెప్టెన్ యానీ మాస్టర్‌ని ఆదేశించారు బిగ్‌బాస్. దీంతో యానీ.. మానస్, కాజల్, సన్నీ, షణ్ముఖ్‌లను నామినేట్ చేసి జైలులో పెట్టింది. అయితే యానీ నామినేషన్‌ని మార్చేసే అవకాశాన్ని మిగిలిన ఇంటి సభ్యులకు ఇచ్చారు బిగ్‌బాస్. దీనిలో భాగంగా.. బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియాలో ఉన్న తాళాలను పట్టుకుని వాటి ద్వారా తమకి ఇష్టమైన వ్యక్తిని బయటకు తీసుకురావొచ్చు. అలా బయటకు వచ్చిన వ్యక్తి మరో ఇద్దరిని నామినేట్ చేస్తే.. వారిలో ఒకరు నామినేట్ అయి జైలుకు వెళ్లాలి. ఫైనల్ గా జైల్లో ఎవరు మిగులుతారో వారు ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అవుతారు.
ముందుగా షణ్ముఖ్.. సిరి, రవిలతో ప్లాన్ వేయడం మొదలుపెట్టారు. తాళం దొరికితే ముందు తనను బయటకు తీసుకురావొద్దని స్ట్రాటజీ చెప్పాడు. ఇందులో భాగంగా ప్రియాంక తాళం దక్కించుకొని మానస్‌ని బయటకు తీసుకొచ్చింది. బయటకు వచ్చిన మానస్.. జెస్సీ, రవిలను నామినేట్ చేశాడు. సిరి తాళం దక్కించుకొని షణ్ముఖ్‌ను కాదని జెస్సీని బయటకు తీసుకొచ్చింది. జెస్సీ వల్ల షణ్ముఖ్ బయటపడ్డాడు. తనకు ఒకరిని నామినేట్ చేసే చాన్స్ రావడంతో.. పింకీని ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కాబట్టి ఆమెను ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. ఫైనల్ కాల్ ప్రియాంక తీసుకోవాలి కాబట్టి ఆమె ఇద్దరిలో జెస్సీని జైలుకి పంపించింది.
దీంతో బాగా హర్ట్ అయిన పింకీ.. ‘‘ ఉన్న నలుగురిలో వేరే ఆప్షన్ లేదని నన్ను నామినేట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నా పాయింట్‌లో నువ్వు కరెక్ట్ కాదు. తరువాత ఎప్పుడైనా నన్ను నామినేట్ చేయాలనుకుంటే సరైన కారణం ఇవ్వు` అంటూ అసహనం వ్యక్తం చేయగా.. `నా పాయింట్‌లో ఇదే కరెక్ట్.. నేను ఇలానే నామినేట్ చేస్తా... అది నా ఇష్టం` అంటూ షణ్ముఖ్ తేల్చిచెప్పాడు. ఆ తర్వాత రవి తాళం దక్కించుకుని ప్రియాంకని సేవ్ చేసి... షణ్ముఖ్‌ని పంపించాడు. శ్రీరామ్ తాళం దక్కించుకుని కాజల్‌ని సేవ్ చేసి.. సిరిని లోపలికి పంపించాడు.
ఆ తరువాత కాజల్.. జైల్లో ఉన్న సన్నీ, మానస్ లతో డిస్కషన్ పెట్టింది. శ్రీరామ్ తనతో డీల్ పెట్టుకున్నాడని.. సిరిని జైలు నుంచి బయటకు తీసుకురావాలని చెప్పింది కాజల్. అయితే ఆ ప్రపోజల్‌కి మానస్-సన్నీ ఒప్పుకోలేదు. 'ఇది కార్నర్ గేమ్' అంటూ మానస్ కామెంట్ చేశాడు. చివరకు సన్నీ.. 'నీ కాల్ నీ ఇష్టం' అని తేల్చి చెప్పేశాడు. ఆరోసారి బజర్ మోగినప్పుడు కాజల్ తాళం తీసుకొని జైల్లో ఉన్న షణ్ముఖ్‌ని బయటకు తీసుకొచ్చింది. బయటకొచ్చిన షణ్ముఖ్.. రవి, శ్రీరామ్ లను నామినేట్ చేయగా.. ఫైనల్ కాల్ కాజల్ తీసుకోవాలి కాబట్టి ఆమె రవిని సెలెక్ట్ చేసింది. దీంతో జైల్లో ఉన్న నలుగురు నేరుగా నామినేట్ అయ్యారు. అలానే కెప్టెన్ యానీ మాస్టర్‌ని మిగిలిన ఇంటి సభ్యుల నుంచి మరొకరిని నామినేట్ చేయమని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో కాజల్ తనకు ఎప్పుడూ హెల్ప్ చేయలేదని చెబుతూ ఆమెను నామినేట్ చేసింది. దీంతో ఈ వారం మానస్, సిరి, సన్నీ, రవి, కాజల్‌లు నామినేట్ అయ్యారు.
ఇక ఇప్పటి వరకు లోబో, ప్రియా, శ్వేత, హమీదా, లహరి, నటరాజ్‌మాస్టర్, ఉమాదేవి, సరయు, విశ్వ బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com