బిగ్‌బాస్ 5 తెలుగు: శ్రీరామ్‌కి హమీదాతో వున్న రిలేషన్ ఏంటీ.. ఏడిపించేసిన నటరాజ్ మాస్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ హౌస్‌లో ఏమోషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. నిన్న కంటెస్టెంట్లంతా ఫస్ట్ లవ్ చెప్పి అందరినీ ఏడిపిస్తే... ఈ రోజు నటరాజ్ మాస్టర్ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఈ రోజు ఎపిసోడ్లో ప్రధానంగా నటరాజ్ మాస్టర్ భార్య సీమంత వీడియో హైలైట్‌గా నిలిచింది. ముందుగా చిన్న పాప ఏడుస్తున్నట్టుగా ఓ ఆడియోని వినిపించి అందరికి షాక్‌తోపాటు సర్ప్రైజ్ చేశారు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఇవాళ్టీ ఎపిసోడ్ సోడ్ వివరాల్లోకి వెళ్లాల్సిందే,
ఈరోజు ఎపిసోడ్లో సిరి, నాతో మాట్లాడు.. నువ్ నాతో మాట్లాడడం లేదనే నేను వేరే వాళ్లతో స్నేహం చేస్తున్నానని చెప్పింది. చేస్కో అని షణ్ముఖ్ చెప్పగా.. వాళ్లు జెన్యూన్ కాదని సిరి చెప్పింది. ఆ తరువాత షణ్ముఖ్ 'ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది బిగ్ బాస్ హౌస్ లో' అంటూ సిరికి హితబోధ చేశాడు.
లగ్జరీ బడ్జెట్ టాస్క్ 'అతికిందంటే అదృష్టమే..' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో ఫుడ్ ఐటమ్స్ రాసి ఉన్న బంతులు గోడకు విసరాలి. ఏవైతే గోడకు అతుకుతాయో అవి హౌస్‌మేట్స్‌కు అందుతాయని తెలిపాడు. టాస్క్ ఆడదానికి వెళ్లేముందు నటరాజ్ మాస్టర్.. ముందు విశ్వను పంపిద్దామని ఆయనకీ ఈ టాస్క్ లో బాగా ఐడియా ఉంటుందని చెప్పాడు. దీంతో సన్నీ.. యూనిటీ అన్నప్పుడు ఒక పేరు తీయొద్దు మాస్టర్.. అందరూ ఆడగలరు అని అన్నాడు. దానికి నటరాజ్ మాస్టర్.. 'నాకు అనిపించింది చెప్పాను.. ఇక్కడ అందరూ ఆడగలరు.. ఎవరికి వాళ్లు తోపులని ఫీల్ అవుతారు. లాస్ట్ టైమ్ ఏమైనా పీకారా..?(లగ్జరీ బడ్జెట్ టాస్క్ ను ఉద్దేశిస్తూ) అందరూ కలిపి తినాల్సిన ఫుడ్ ఇది.. అందరూ కలిసి పనిచేస్తేనే అవుతుంది' అంటూ సీరియస్ అయ్యాడు. ఈ టాస్క్‌లో విశ్వ ఫెయిలవ్గా...సన్నీ, రవి, శ్రీరామ్ ఎలాగో కష్టపడి పడి పూర్తి చేశారు.
మానస్.. హమీదకి ఫుడ్ తినిపిస్తూ.. ''అమ్ము(లహరి) ఏంటో అర్ధం కావడం లేదబ్బా.. చాలా పొసెసివ్ గా బిహేవ్ చేస్తుంది'' అని కామెంట్ చేశాడు. దానికి హమీద 'క్లియర్ చేస్కో.. నాకు మధ్యలో శ్రీరామ్ తో అలానే ఉండేది.. క్లియర్ చేసుకున్నా' అని చెప్పింది. మానస్ అలా హమీదకి ఫుడ్ తినిపిస్తున్నప్పుడు ప్రియాంక వచ్చి చూసింది. అంతే ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి.
సన్నీ, లోబో, హమీద, నటరాజ్ మాస్టర్, యానీ కలిసి గేమ్ గురించి డిస్కషన్ పెట్టారు. ఈ క్రమంలో నటరాజ్ మాస్టర్ 'గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలనే బేసిక్ నాలెడ్జ్, సెన్స్ కూడా ఉండదు. ఏమైనా అంటే ప్రొఫెషన్ మీద ఇన్ డైరెక్ట్ డైలాగ్స్. అవి గనుక బయటకొస్తే.. బయటే విరగ్గొట్టేస్తా కాళ్లు' అంటూ ఫైర్ అయ్యాడు. 'ప్రొఫెషన్ మీద ఎవరన్నారు మాస్టర్ అని యానీ, సన్నీ' అడగ్గా.. 'నాకు తెలుసు.. చెప్తా చెప్తా.. నాకు డ్రామాలు రావు. ముందు ఒకలాగా, వెనక ఒకలాగా రావు నాకు. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా' అని నటరాజ్ మాస్టర్ అన్నాడు. ఈ విషయంలో సన్నీ, నటరాజ్ మాస్టర్ కాసేపు వాదించుకున్నారు.
రవి, సిరి, కాజల్.. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో అని మాట్లాడుకున్నారు. సిరి ఇద్దరు 'పి'(ప్రియాంక, ప్రియా)లలో ఎవరో ఒకరు వెళ్తారనిపిస్తుందని చెప్పింది. ఆ తరువాత అందరూ నటరాజ్ మాస్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుకున్నారు. ఆయనకి అనుమానం ఎక్కువ అని సిరి అనగా.. సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నారని రవి అన్నాడు. ఆ తరువాత లహరి వెళ్లి విశ్వ, లోబోలతో డిస్కషన్ పెట్టింది. ''టీమ్స్ లాగా డివైడ్ అయిపోయారు.. నేను వెళ్లగానే అప్పటివరకు నవ్వుతున్న వాళ్లు, మాట్లాడుకుంటున్న వాళ్లు సడెన్ గా ఆపేస్తున్నారు. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది' అని చెప్పింది లహరి.
తర్వాత ఇంటిసభ్యులందరూ టాస్క్‌లతో పాటు ఇంట్లోని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బెస్ట్, వరస్ట్ పర్ఫామ్స్ను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. కెప్టెన్ జెస్సీ.. హమీదాను; షణ్ముఖ్, హమీదా, సిరి, కాజల్, రవి, నటరాజ్ మాస్టర్, శ్రీరామచంద్ర.. మానస్‌ను; విశ్వ, లహరి.. ప్రియను; యానీ మాస్టర్.. సన్నీని; శ్వేత వర్మ.. నటరాజ్ మాస్టర్, సన్నీ.. షణ్ముఖ్లనను వరస్ట్ పర్ఫామర్లుగా సూచించారు. మానస్.. తనకు తానే నచ్చలేదంటూ తన పేరు చెప్పుకున్నాడు. అది కుదరదని కెప్టెన్ వారించడంతో మానస్.. జెస్సీ పేరును సూచించాడు. మొత్తంగా ఎక్కువ ఓట్లు వచ్చిన మానస్‌ను చెత్త ఆటగాడిగా చెబుతూ అతడిని జైల్లో వేశారు. అయితే జైలుకు వెళ్లడం కూడా ఒక స్ట్రాటజీ అని యానీ కామెంట్ చేసింది.
మానస్ జైల్లో ఉన్నందుకు ప్రియాంక సింగ్ ఆ జైలు దగ్గరే స్పెండ్ చేస్తోంది. హమీదాకు తినిపించినందుకు బాగా హర్టయిన పింకీ.. నువ్వు జైల్లో ఉన్నావు కదా! మరి హమీదాకు ఎవరు తినిపిస్తారు? అని క్శశ్చన్ చేసింది. అంతలోనే అందుకుంటూ ఆమెకు రెండు చేతులు బాగానే ఉన్నాయి కదా, అయినా మూడు పూటలా తినిపిస్తున్నాడు అని అక్కసు వెళ్లగక్కింది. తర్వాత మాత్రం తన జెలసీని పట్టించుకోవద్దని, అలా అని పూర్తిగా పట్టించుకోకుండా ఉండొద్దని చెప్పింది. హమీదాకు తినిపిస్తుంటే ఆ కోతిముఖం దానికి అవసరమా? అన్నానని చెప్పింది. దీంతో మానస్.. ఆమె తనకు ఫ్రెండ్ అని, సిస్టర్ అనమంటే కూడా అంటానని అనడంతో ఎగిరి గంతేసిన పింకీ.. వద్దులే, ఫ్రెండ్‌లానే ఉండమని చెప్పింది. అవసరమైతే శ్రీరామ్‌కు అయినా రాఖీ కడతా కానీ నీకు మాత్రం కట్టనని మానస్‌కు తెగేసి చెప్పింది.
తర్వాత లోబో పట్టపగలే నిద్ర పోవడంతో కుక్కలు మొరిగాయి. దీంతో కెప్టెన్ జెస్సీ ఇంట్లోకి పరుగు తీసి లోబోను నిలదీయగా తాను నిద్రపోలేదని దబాయించాడు. కెప్టెన్‌గా తన మాటను ఎవరూ పట్టించుకోవట్లేదని ఫీలైన జెస్సీ.. ఇంట్లో చాలామంది తప్పులు చేస్తున్నారని, వారికి బదులుగా తాను శిక్ష తీసుకుంటానంటూ గుంజీలు తీశాడు. అనంతరం ఇంట్లో సడన్‌గా పసిపాప ఏడుపులు, నవ్వులు వినిపించడంతో అందరూ షాకయ్యారు. ఎవరైనా పిల్లలు వస్తున్నారా అని అంతా గేటు వంక చూశారు. కానీ బిగ్‌బాస్ మాత్రం ఓ బేబీ బొమ్మను పంపించాడు. పసిపాప నవ్వులు వినగానే చాలామంది వారి పిల్లలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
ఇంతలో నటరాజ్ భార్య నీతూ సీమంతం వేడుకల వీడియోను చూపించాడు బిగ్‌బాస్. తన భార్యను చూడగానే నటరాజ్ మాస్టర్ కళ్ల వెంట నీళ్లు ధారలు కట్టాయి. 'నువ్వు రాత్రి మాట్లాడేటప్పుడు బేబీ కదిలేది కదా, ఇప్పుడు బిగ్‌బాస్‌లో నీ వాయిస్ విని నాతో డిష్యుం డిష్యుం చేస్తుంది. బేబీ బాగా కదులుతుంది. నా గురించి టెన్షన్ పడకు. సాధించే రావాలి. జాగ్రత్త' అని భార్య చెప్పిన మాటలు విని నటరాజ్ ఏడ్చేశాడు.
తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీరామచంద్ర, హమీద కలిసి కిచెన్ రూమ్ లో ముచ్చట్లు పెట్టారు. తనకు ఎందుకు ఫుడ్ తినిపించలేదని శ్రీరామ్.. హామీదను అడిగాడు. మానస్ నీకు తినిపిస్తాడు కదా.. నువెందుకు నాకు తినిపించవ్ అని అడగ్గా.. 'నేను నీతో మాట్లాడే విధానం, చూసే విధానం వేరేలా ఉంటుంది. మానస్, సన్నీలను ఫ్రెండ్స్ లానే చూస్తాను.. నీకు అది తెలియడం లేదా..?' అని ప్రశ్నించింది హమీద. 'నేను అంత గమనించను' అని శ్రీరామ్ బదులిచ్చాడు. 'కొన్ని సార్లు నువ్ అర్ధమవుతావ్ కొన్నిసార్లు అర్ధం కావు.. ఇలా కనెక్ట్ అవుతావ్.. వెంటనే డిస్ కనెక్ట్ అవుతావ్..' అంటూ చెప్పేసింది హామీద. దానికి శ్రీరామ్.. 'నీకు, మానస్ కి ఒక డెఫినిషన్ ఉంది అది ఫ్రెండ్ షిప్. కానీ నీకు నాకు మధ్య ఆ డెఫినిషన్ లేదు. ఫ్రెండ్ కంటే ఎక్కువ కావొచ్చు, తక్కువ కావొచ్చు. నీది, నాది క్వశ్చన్ మార్క్ జోన్ లో ఉంది ప్రస్తుతానికి' అంటూ చెప్పగా.. హమీద నవ్వేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com