బిగ్‌బాస్ 5 తెలుగు: యానీ మాస్టర్ తో ఫైట్.. పిల్లో చాటున ఏడ్చేసిన శ్వేతా, ప్రియా బూతులు
Send us your feedback to audioarticles@vaarta.com
'బిగ్ బాస్' 5 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. 'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ తన ఇంటి సభ్యుల్ని నాలుగు గ్రూప్‌లుగా విడగొట్టారు. సిరి, కాజల్‌లను సంచాలకులుగా నియమించారు. ఈరోజు కూడా ఈ టాస్క్ కంటిన్యూ అయింది. మంగళవారం యానీ మాస్టర్ సిరిపై చిందులు తొక్కింది. కానీ బుధవారం ఎపిసోడ్లో మాత్రం ఆమె దారుణంగా బుక్కయ్యారు. ఇక ప్రియా సైతం సంచాలక్లపై బూతులు తిట్టడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
గ్రీన్ టీం సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్ బొమ్మ రూపంలో స్పెషల్ పవర్ లభించడంతో వారు మిగిలిన మూడు టీమ్‌లలో తమకు నచ్చిన టీమ్ సభ్యులు తయారు చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చు. దీంతో యాంకర్ రవి.. తనకు బిగ్‌బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ ద్వారా ఎక్కువ బొమ్మలు తయారు చేసిన యానీ మాస్టర్ టీమ్ దగ్గర ఉన్న బొమ్మల్ని లాగేసుకున్నారు. దీంతో యానీ మాస్టర్ .. శ్వేత దాచిపెట్టిన బొమ్మలను లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్వేత, యానీల మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం నడిచింది. దీనికి నొచ్చుకున్న యానీ.. లాస్ట్ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కలో రిలేషన్షిప్ నాకొద్దంటూ అంటూ శ్రీరామ్-విశ్వలతో చెప్పుకొని బాధపడింది యానీ. ఆ మాటలతో శ్వేత కన్నీటిపర్యంతమైంది. అటు యానీమాస్టర్, శ్వేతలు ఏం తినకుండా అలాగే వుండిపోయారు. అయితే రాత్రయ్యేసరికి యానీ మాస్టర్.. రా తిందాం అని శ్వేతని అడగటంతో తిరిగి వారిద్దరూ నార్మల్ అయిపోయారు.
రవి అంత క్రిమినల్ మైండ్ చూడలేదంటూ మానస్ కి చెప్పాడు సన్నీ. ఆ తరువాత యానీతో రవి-లోబో డిస్కషన్ పెట్టారు. లోబోపై యానీ సీరియస్ అయింది. దీంతో మానస్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. మరోపక్క శ్వేతా పిల్లో అడ్డం పెట్టుకొని ఏడ్చేసింది. ఆ తరువాత మానస్ తో ప్రియాంక మాట్లాడింది. 'నీ దగ్గర నేనెప్పుడైనా బోర్డర్ క్రాస్ చేసినట్లు అనిపించిందా..?' అని ప్రశ్నించింది ప్రియాంక. దానికి మానస్ లేదని చెప్పాడు. 'పదే పదే ఇదే క్వశ్చన్ అడిగి నువ్ ఇబ్బంది పడకు.. నన్ను ఇబ్బంది పెట్టకు' అని మానస్ చెప్పగా.. ప్రియాంక ఎమోషనల్ అయి ఏడ్చేసింది.
ఆ తర్వాత కన్వేయర్ బెల్ట్‌పై నుంచి వచ్చే రా మెటీరియల్ తీసుకునే క్రమంలో సిరికి, సన్నీకి పెద్ద గొడవ జరిగింది. ఇతర టీమ్‌లకి ముందుగా నిల్చుని వాటిని తీసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. `ఇదేందిరా భయ్.. నా తొక్కలో ఆట.. వాళ్లు చేయిపెడితే ఒకటి నేను పెడితే ఒకటా.. ఇదేం రూల్స్ ` అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో హర్ట్ అయిన సిరి గట్టిగానే స్పందించింది. సంచాలకులమైన తమపై కేకలు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అందరి ముందు తనకు సారీ చెప్పాలని ఆదేశించింది. కానీ సన్నీ దానిని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా సిరి రకరకాలుగా కామెంట్లు చేస్తూ రెచ్చగొట్టేప్రయత్నం చేశారు. `నేను సారీ చెప్పా.. ఏం చేసుకుంటావో చేస్కో పో` అంటూ పవన్ కళ్యాణ్ మ్యానరిజాన్ని చూపించాడు. మరో సంచాలకురాలు కాజల్ తన స్ట్రాటజీ గేమ్‌కి తెరలేపింది. మేం పెట్టిన రూల్‌ని అతిక్రమించిన కారణంగా గ్రీన్ టీం నుంచి ఒకరు ఎల్లో టీం నుంచి ఒకరు ముందు నిలబడాలంటూ రూల్ పెట్టింది. ఈ విషయంలో ప్రియా విభేదించింది. దీంతో వీరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది.
ఇక సిరి ఎమోషనల్ అవుతుండగా.. షణ్ముఖ్ ఆమెని హత్తుకొని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక సన్నీ కెమెరా ముందుకెళ్లి కెప్టెన్ డ్రెస్ వేసుకుంటా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. 'స్పెషల్ పవర్ ఇవ్వాలి నాకు.. అప్పుడు తిప్పుతా గేమ్' అంటూ ప్రియా డైలాగ్ వేసింది. `నిన్న చాలామంది లైన్ క్రాస్ చేశారు.. మరి ఈ సంచాలకులు ఏం పీకుతున్నారు` అంటూ ప్రియా గట్టిగా అనడం, దాన్ని మళ్లీ మళ్లీ రిపీట్ చేయడంతో సిరి కన్నీళ్లు పెట్టుకుంది. ఒక్కొక్కరు నోరు జారుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది సిరి. మరోవైపు సన్నీ మాత్రం సిరిని కామెంట్ చేస్తూ `అటు బస్సూ.. ఇటు బస్సూ ` అనే పాట అందుకున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments