బిగ్‌బాస్ 5 తెలుగు: హౌస్ నుంచి యానీ అవుట్.. రవి, కాజల్, సన్నీలకి ఏం చెప్పిందంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు రాను రాను ఉత్కంఠగా మారుతోంది. హౌస్‌లో బాగా పర్ఫామెన్స్ ఇచ్చిన యానీ మాస్టర్ ఈరోజు ఎలిమినేట్ అయ్యారు. అంతకు ముందు నాగ్ ఇంటి సభ్యులతో ఫన్నీ టాస్క్ ఆడించారు. ఇక రాజ్ తరుణ్ ‘‘అనుభవించు రాజా’’ టీమ్ బిగ్‌బాస్ స్టేజ్ మీద సందడి చేశారు. మరి వెళుతూ వెళుతూ యానీ మాస్టర్ ఏం చెప్పి వెళ్లింది. తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున.. వచ్చీరావడంతోనే హౌస్‌మేట్స్ తో ఓ టాస్క్ ఆడించారు. ఒక్కో ఇంటి సభ్యుడికి ఇతర హౌస్ మేట్ అడిగిన ప్రశ్నను చదివి వినిపిస్తానని.. కానీ ఆ హౌస్ మేట్ ఎవరో చెప్పనని అన్నారు నాగార్జున. అదే సమయంలో ఒకరిపై ఒకరు చేసిన కామెంట్లని ప్రశ్నల రూపంలో ఓపెన్ చేయించి వాళ్ల బండారం బయటపెట్టించే ప్రయత్నం చేశారు. అనంతరం నామినేషన్ లో ఉన్న ఆరుగురిలో కాజల్ సేవ్ అయిందని.. ముందుగా ప్రకటించారు నాగార్జున.
తర్వాత బిగ్ బాస్ స్టేజ్ పైకి 'అనుభవించు రాజా' సినిమా టీమ్ వచ్చి సందడి చేసింది. రాజ్ తరుణ్‌ను చూసి బాగా ఎగ్జైట్ అయ్యింది సిరి. రాజ్ అంటూ గట్టిగా అరిచింది. 'ఏంటి సిరి విశాఖపట్టణం కనెక్షనా..?' అని నవ్వుతూ నాగార్జున. ఆ తరువాత రాజ్ తరుణ్ 'హే సిరి సంబంధాలు చూస్తున్నాం' అని అనగా.. దానికి సిరి సిగ్గుపడింది. వెంటనే రాజ్ తరుణ్ 'నీకు కాదు..' అంటూ ఆటపట్టించాడు.
ఆ తరువాత హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఒక్కో కంటెస్టెంట్ కి వేరే హౌస్ మేట్స్ పేర్లు ఇచ్చి.. బోర్డు మీద వాళ్ల గురించి డ్రాయింగ్ గీస్తే.. మిగిలిన వాళ్లు గెస్ చేయాల్సి వుంటుంది. పింకీ వచ్చి బోర్డు మీద ఏవో పిచ్చిగీతలు గీయగా.. అది శ్రీరామ్ అని కరెక్ట్ గా గెస్ చేశాడు మానస్. అనంతరం నామినేషన్ లో మిగిలిన ఐదుగురిని మైక్ ముందుకు వచ్చి మాట్లాడమన్నారు నాగ్. ఎవరు మాట్లాడుతుండగా చప్పట్లు వినిపిస్తాయో వాళ్లు సేఫ్ అని చెప్పారు. ఈ సందర్భంగా మానస్, షణ్ముఖ్ సేవ్ అయ్యారు.
అనంతరం హౌస్ మేట్స్‌తో డైలాగ్ కొట్టు గురు అనే టాస్క్ ఆడించారు నాగార్జున. తొలుత సన్నీకి 'నన్ను రెచ్చగోక్కు' అనే డైలాగ్ ఇచ్చాడు మానస్. రవికి 'నమ్మకం లేదు దొరా' అనే డైలాగ్ ఇచ్చాడు షణ్ముఖ్. 'సర్ సర్లే చాలా చూశాం..' అనే డైలాగ్ ను రవి.. షణ్ముఖ్ కి ఇచ్చాడు. యానీ 'మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో' అనే డైలాగ్ రవికి ఇచ్చింది. 'ఓన్లీ వన్స్ ఫసక్' అనే డైలాగ్ ను మానస్ కి ఇచ్చింది ప్రియాంక. 'ఏమో సార్ నాకు కనపడదు' అనే డైలాగ్ ను షణ్ముఖ్ కి ఇచ్చాడు శ్రీరామ్. 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అనే డైలాగ్ ను షణ్ముఖ్ కి ఇచ్చింది సిరి. 'నీ బొంద రా నీ బొంద' అనే డైలాగ్ ను శ్రీరామ్ కి ఇచ్చింది కాజల్. 'అయిపాయే' అనే డైలాగ్ ను రవికి ఇచ్చాడు సన్నీ. ఈ క్రమంలోనే నామినేషన్‌లో ఉన్న ముగ్గురిలో సిరి సేఫ్ అని ప్రకటించారు నాగార్జున.
దీంతో నామినేషన్‌లో వున్న యానీ , ప్రియాంకలలో ఎవరు సేఫ్ అవుతారోనన్న టెన్షన్ పెరిగిపోయింది. వారిద్దరినీ గార్డెన్ ఏరియాకు పిలిచారు నాగార్జున. ఇద్దరికీ అడుగుల టాస్క్ ఇచ్చారు.. ఫైనల్‌గా యానీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడంతో పక్కనే వున్న ప్రియాంక ఎమోషనలై కన్నీళ్లు పెట్టుకుంది. యానీని హత్తుకొని ఏడ్చేసింది. తనను శత్రువులా చూసినప్పటికీ కాజల్ కూడా యానీని హగ్ చేసుకొని గుడ్ బై చెప్పింది.
అనంతరం స్టేజ్ పైకి వచ్చిన యానీ మాస్టర్‌ని ఇంటి సభ్యుల గురించి ఏం అనుకుంటున్నారో చెప్పమని అడిగారు నాగార్జున. మొదటి నుండి నన్ను బాగా మోటివేట్ చేశావ్ అని' రవికి చెప్పింది యానీ. అలాగే ఆయన టాప్ 3లో ఖచ్చితంగా వుంటాడని అభిప్రాయపడింది. 'శ్రీరామ్ కొన్ని వారాలుగా తనకు అండగా ఉన్నాడని' ప్రశంసించింది యానీ. మంచి బ్రదర్, ఫ్రెండ్ అని చెప్పింది. 'మనం ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. కానీ ఎప్పుడు మాట్లాడినా.. బాగా మాట్లాడారు' అని షణ్ముఖ్ గురించి చెప్పింది. నువ్వు 'పటాకా' అంటూ సిరికి చెప్పింది. 'నీ గేమ్ నువ్ బాగా ఆడుతున్నావ్.. అలానే ఆడు' అని ప్రియాంకకి సూచనలు ఇచ్చింది. ఇక టాప్ 8లో ఉన్న కాజల్‌కి కంగ్రాట్స్ చెప్పింది . అలాగే 'బయటకొచ్చాక మనం ఫ్రెండ్స్ అవుదామని' మానస్ తో, సన్నీని బాగా మిస్ అవుతానని చెప్పి అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది యానీ మాస్టర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout