బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియాంకను కిస్ చేసిన జెస్సీ.. పింకీ- మానస్‌ల పబ్లిక్ రోమాన్స్, కొత్త కెప్టెన్‌గా యానీ మాస్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగులో భాగంగా ఈ రోజు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఓ వైపు మానస్- ప్రియాంకల మధ్య లవ్ స్టోరీ, మరోవైపు షణ్ముఖ్, సిరిల మధ్య ఫ్రెండ్‌షిప్ విభేదాలతో హౌస్ హీటెక్కింది. అందరూ షాకయ్యేలా ప్రియాంకకు ముద్దు పెట్టాడు జెస్సీ. ప్రియాంకను సిస్టర్ అని మానస్ పిలవడంతో ఏం జరుగుతుందో హౌస్ మేట్స్‌కి అర్ధం కాలేదు. మళ్లీ షణ్ముఖ్, జెస్సీ, సిరిల మధ్య గొడవ జరగ్గా బిగ్‌బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్ వచ్చారు. మరి ఆ వ్యక్తి ఎవరో..? కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఎలాంటి ఘటనలు జరిగాయో తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.
గత రెండు రోజులుగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్‌లో ఇంటి సభ్యులు ఒకరినొకరు టార్చర్ చేసుకుంటూ కనిపిస్తున్నారు. ఈరోజు కూడా ఈ టాస్క్ కొనసాగింది. ముందుగా బిగ్ బాస్ సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు. ఇప్పటి వరకు జట్టుగా గేమ్ ఆడించిన బిగ్‌బాస్ ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ఆడాల్సిందిగా ఆదేశించాడు. సూపర్‌విలన్స్, సూపర్ హీరోస్‌ల నుంచి ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఒక చిన్న ఫ్లాట్‌ఫామ్‌పై నిలబడి ఒకరినొకరు కర్రతో తోసుకోవాలి. ఎవరైతే పడిపోతారో వాళ్లు ఓడినట్లు. ఈ టాస్క్‌లో భాగంగా హీరోస్ టీమ్ నుంచి బరిలోకి దిగిన మానస్ .. విలన్స్ టీమ్ సభ్యులందరిని ఓడించేశాడు. దీంతో హీరోస్ టీమ్ విజయం సాధించింది. అనంతరం తాళం చెవిని విలన్స్ టీమ్ దక్కించుకుంది. రెండు రోజులుగా జరుగుతున్న టాస్క్‌లతో కలిపి విలన్స్ టీమ్ ఎక్కువ పాయింట్స్ పొంది కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌కి ఎంపికైంది.
దీంతో సూపర్ విలన్స్ టీమ్‌కి హౌస్ మేట్స్‌కి కంగ్రాట్స్ చెప్పారు. అనంతరం ప్రియాంక వెళ్లి జెస్సీకి విష్ చేస్తుండగా.. జెస్సీ అకస్మాత్తుగా ఆమెని కిస్ చేశాడు. ఇక ఉదయాన్నే మానస్-ప్రియాంక-కాజల్ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మానస్.. ప్రియాంకను సిస్టర్, సిస్టర్ అంటూ ఆటపట్టించాడు. ఆ తరువాత సిరి-ప్రియాంక మాట్లాడుకున్నారు. 'ఎంతవరకు వచ్చింది మీ ఇద్దరి లవ్' అంటూ ప్రియాంకను అడిగింది సిరి. దీంతో తెగ సిగ్గుపడింది ప్రియాంక. మానస్‌కి కూడా ఇష్టమే కదా అంటూ సిరి గుచ్చిగుచ్చి అడ్గా..... దానికి ప్రియాంక బదులిస్తూ 'ఒప్పుకున్నాడు.. నేనేంటో తనకు తెలుసు' అంటూ మెల్లగా చెప్పింది. ఆ తరువాత ప్రియాంక.. మానస్‌తో మాట్లాడుతుండగా.. 'మచ్చా అక్కడేం జరుగుతుందని' సన్నీ.. కాజల్ ని అడిగాడు. దానికి ఆమె వాళ్లిద్దరూ 'ప్రేమించుకుంటున్నారు' అని ఆన్సర్ ఇచ్చింది. అదే సమయంలో ప్రియాంక.. మానస్‌ని కౌగిలించుకుంది. అది చూసిన సన్నీ ఇంత పబ్లిక్ గానా..?' అంటూ కామెంట్ చేశాడు.
ఇక గురువారం నాటి టాస్క్ సందర్భంగా సిరి, షణ్ముఖ్ మధ్య ఇన్నర్ వేర్స్ గురించి గొడవ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దూరం దూరంగా ఉంటున్న సిరి.. మళ్లీ షణ్ముఖ్‌తో మాట కలిపింది. నేను దుస్తులు ఎగరేశా.. అందులో ఇన్నర్ వేర్స్ ఉన్నాయని నాకేం తెలుసు? అని షణ్ముఖ్‌తో చెప్పింది సిరి. కెప్టెన్‌గా ఇల్లు నీట్‌గా వుంచలేదని నాగ్ సార్ క్లాస్ పీకుతారు.. అందుకే అలా కోపడ్డాను అని షణ్ముఖ్ బదులిచ్చాడు.
ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా 'చిక్కకు దొరకకు' అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఇందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారులపై మిగిలిన ఇంటి సభ్యులు బాల్స్ విసురుతూ ఉంటారు. ఎవరికైతే తక్కువ బాల్స్ అతుక్కుంటాయో వాళ్లు కెప్టెన్ అని ప్రకటించారు. ఈ టాస్క్‌లో చివరి వరకు కసిగా ఆడిన యాని మాస్టర్ కెప్టెన్‌గా గెలిచి తన కోరికను నెరవేర్చుకుంది. అయితే షణ్ముఖ్ తనపై కావాలని ఎక్కువ బాల్స్ విసిరాడని సిరి ఫైర్ అయ్యింది. ఆ తరువాత రవి, సన్నీ, విశ్వ, సిరి చర్చించుకుంటున్నారు. సన్నీ.. షణ్ముఖ్ గురించి సిరితో మాట్లాడుతుండగా.. రవి జోక్యం చేసుకుని 'ఒరేయ్ వాళ్లిద్దరి మధ్యలోకి వెళ్లకు. ఆ ఇద్దరూ తర్వాత కలిసిపోతారు... మనం ఎదవలం అయిపోతాం.. అలా నేనొక పాతిక సార్లు అయ్యాను' అంటూ సెటైర్లు వేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments