బిగ్‌బాస్ 5 తెలుగు: కొట్టుకోబోయిన శ్రీరామ్- సన్నీ.. ఈవారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే..?

  • IndiaGlitz, [Tuesday,November 23 2021]

బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ 12వ వారానికి చేరుకుంది. ఇక మూడు వారాలు మాత్రమే మిగిలి వుండటంతో ఎవరు విన్నర్‌గా నిలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. యానీ మాస్టర్ ఎలిమినేషన్ అవ్వడంపై కాజల్-శ్రీరామ్‌ ఇక సోమవారం కావడంతో నామినేషన్స్ రగడ మొదలైంది. మరోసారి ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడంతో నామినేషన్ల ప్రక్రియ మరింతగా హీటెక్కింది. మరి ఈ వారం ఎవరెవరు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారో చూడాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

సోమవారం ఎపిసోడ్ ప్రారంభమవ్వగానే.. యానీ మాస్టర్ ఎలిమినేషన్‌పై ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్‌గా కనెక్షన్‌ వస్తుందని గతంలో అన్న మాటని కాజల్‌.. శ్రీరామ్‌ని ప్రశ్నించగా.. నేను ఎప్పుడూ ఆ మాట అనలేదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. అనంతరం వాష్‌రూమ్‌ క్లీనింగ్‌కి సంబంధించిన చర్చ నడిచింది. రవి కెప్టెన్‌గా ఉన్నప్పుడు అసలు క్లీన్‌ చేయలేదని, ఆయన సరిగా పనిచేయలేదని మానస్- సన్నీ మాట్లాడుకున్నారు.

అనంతరం బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రక్రియను షురూ చేశాడు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ ముందు వాళ్ల ఫొటోలతో దిష్టి బొమ్మలు పెట్టారు. ఒక్కో హౌస్ మేట్ తము నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు కంటెస్టెంట్ల దిష్టిబొమ్మలపై కుండను పెట్టి పగలగొట్టాల్సి ఉంటుంది. మొదట..రవి.. ఇంట్లో పనులు సరిగ్గా చేయడం లేదని సన్నీని నామినేట్ చేశాడు. అలాగే సిరి-షణ్ముఖ్ లపై ఉన్న డౌట్ ను రవి చెప్పాడని ఫిట్టింగ్ పెట్టడం కరెక్ట్ కాదని రీజన్ చెబుతూ కాజల్‌ను నామినేట్ చేశాడు. ఈ విషయంలో కాజల్-రవిల మధ్య మాటల యుద్ధం జరిగింది.
తర్వాత షణ్ముఖ్.. రవిని నామినేట్ చేస్తూ.. 'కెప్టెన్ గా, సంచాలక్ గా నువ్ స్ట్రాంగ్ గా లేవనిపించింది' అని రీజన్ చెప్పాడు. ఆ తరువాత కాజల్ ని నామినేట్ చేస్తూ.. 'ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడాలని.. నాగార్జున సార్ ముందు అడగడం నచ్చలేదని' రీజన్ చెప్పాడు. శ్రీరామ్‌.. సన్నీ, కాజల్‌లను నామినేట్‌ చేశాడు. ఎవిక్షన్‌ పాస్‌..సన్నీకి ఇవ్వడంపై ఆయన కాజల్‌ని నామినేట్‌ చేశాడు. అలాగే నీవల్ల కెప్టెన్సీ కంటెండర్‌ కాలేకపోయానంటూ సన్నీ కుండ బద్ధలకొట్టాడు శ్రీరామ్‌.

తర్వాత శ్రీరామ్, రవిలను నామినేట్ చేశాడు సన్నీ. దీనిపై శ్రీరామ్, రవిలు సన్నీతో వాగ్వాదానికి దిగారు. ఒకరిపైకి ఒకరు మీద మీదికి వెళ్లారు. దీంతో హౌజ్‌ హీటెక్కిపోయింది. కెప్టెన్‌ మానస్‌ కల్పించుకుని శ్రీరామ్‌ని ఓదార్చాడు. తర్వాత సిరి..రవి, పింకీని, కాజల్‌ రవి, శ్రీరామ్‌లను, మానస్.. శ్రీరామ్‌ని నామినేట్ చేశారు. దీంతో ఈ వారం రవి, సన్నీ, శ్రీరామ్, కాజల్, సిరి, షణ్ముఖ్, ప్రియాంకలు నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించారు.