విశ్వాకు యానీ మాస్టర్ వార్నింగ్.. ప్రియా సెటైర్లు, ఈ వారం నామినేషన్స్‌లో వీరే
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 విజయవంతంగా ఆరో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు ఐదు వారాలు పూర్తయ్యాయి. ఐదో వారం ఊహించని విధంగా హమీదా ఎలిమినేట్ కావడంతో శ్రీరామచంద్ర దానిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు. అర్ధరాత్రి పూట ఇంటిలో ఏవేవో కేకలు వినపడటంతో కంటెస్టెంట్స్ ఉలిక్కిపడ్డారు. ఇక సోమవారం కావడంతో నామినేషన్ల ప్రక్రియతో మరోసారి హౌస్ రణరంగమైంది. మరి ఈ వారం ఎవరు ఎవరిని నామినేట్ చేశారో తెలుసుకోవాలంటే ఈస్టోరీ చదివేయాల్సిందే.
ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఉండటంతో హౌస్‌మేట్స్ అందరూ కూడా ఆ ప్రాసెస్ గురించే మాట్లాడుకున్నారు. అర్ధరాత్రి నిద్రలో శ్రీరామచంద్ర ఏవేవో కేకలు వేయడంతో ఇంటిసభ్యులు ఉలిక్కిపడ్డారు. పక్కనే ఉన్న విశ్వ.. పరిస్థితిని అర్థం చేసుకుని అతడి వీపు నిమురుతూ నిద్రపుచ్చాడు. ఇప్పటికే హౌస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. తాజాగా ఆరోవారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా జరిగింది. నామినేషన్ల ప్రక్రియలో ‘‘అగ్నిపరీక్ష’’ను ఎదుర్కోవాలన్న బిగ్ బాస్ ఆదేశం మేరకు ఇంటి సభ్యులంతా ఎవరెవర్ని నామినేట్ చేస్తున్నారో వారి ఫొటోలను మంటల్లో వేయాల్సి ఉంటుంది.
ముందుగా సన్నీ- కెప్టెన్సీ టాస్క్‌లో రవి కావాలనే ఆడలేదని అతడిని నామినేట్ చేశాడు. ఆ తరువాత జెస్సీని నామినేట్ చేస్తూ.. కాయిన్స్ దొంగతనం చేశాడని రీజన్ చెప్పగా.. నీకు సపోర్ట్ చేసినందుకు నాకు ఇలాగే జరగాలి అంటూ జెస్సీ ఫైర్ అయ్యాడు. విశ్వా - స్ట్రాంగ్ అని చెప్పి నామినేట్ చేయడం.. నాకు కరెక్ట్ అనిపించట్లేదంటూ యానీ మాస్టర్‌ను నామినేట్ చేశారు. దీంతో యానీ అగ్గిమీద గుగ్గిలమైంది. 'నువ్వు ముందొక మాట మాట్లాడతావ్.. వెనుక ఇంకొకటి మాట్లాడతావ్.. ఇక అక్క-తొక్క అని పిలవకు' అంటూ మండిపడింది. ఆ తరువాత ప్రియాంకను నామినేట్ చేశాడు విశ్వ. అనంతరం శ్వేతా - సిరి, కాజల్ లను నామినేట్ చేసింది.
లోబో - ప్రియాంకను నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో కాయిన్స్ దొంగతనం చేసి నమ్మకం పోగొట్టిందని రీజన్ చెప్పాడు. ఆ తరువాత జెస్సీను నామినేట్ చేస్తూ కెప్టెన్సీ టాస్క్ లో దొంగతనం చేసి, నమ్మకాన్ని వమ్ముచేశాడని రీజన్ చెప్పాడు లోబో. దానికి జెస్సీ.. 'నేను ఇక్కడకి గేమ్ ఆడటానికే వచ్చాను.. గేమే ఆడతాను' అంటూ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చాడు. సిరి - శ్రీరామచంద్రను నామినేట్ చేస్తూ.. జెస్సీ ఇష్యూలో నోటికొచ్చినట్లు మాట్లాడావ్ అంటూ రీజన్ చెప్పింది. తరువాత శ్వేతాను నామినేట్ చేస్తూ.. అసలు ఈ అమ్మాయి ఏంటో అర్ధం కాదని, ఒక మాట చెప్తే ఇంకొకటి అర్ధం చేసుకుంటుందని కామెంట్ చేసింది. రవి - మానస్ ని నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయలేదని చెప్పాడు. అనంతరం సిరిని నామినేట్ చేశాడు.
జెస్సీ - శ్రీరామచంద్రను, సన్నీని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో సన్నీ-జెస్సీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రియాంక - లోబోని నామినేట్ చేస్తూ.. 'నమ్మకం గురించి మాట్లాడుతున్నావ్ కదా.. నువ్ కూడా సన్నీ టీమ్ నుంచి రవి టీమ్ కి వెళ్లావ్ కదా' అంటూ గుర్తుచేసింది. ఆ తరువాత విశ్వను నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో బకెట్స్ విసిరేశావంటూ రీజన్ చెప్పింది. 'ప్రతీసారి ఎదవ రీజన్స్ చెప్పుకుంటూ' అంటూ ప్రియాంక.. విశ్వను ఉద్దేశిస్తూ కామెంట్ చేయగా.. 'ఎదవ రీజన్స్ అని నువ్ మాట్లాడకు' అని విశ్వ చెప్పగా.. 'నా ఇష్టం' అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది ప్రియాంక.
మానస్ - ముందుగా రవిని నామినేట్ చేశాడు. 'పదిహేనేళ్ల ఫ్రెండ్షిప్ అని చెప్పి రవి టీమ్ లోకి జంప్ అయ్యావ్.. మా నమ్మకాన్ని బ్రేక్ చేసినట్లనిపించింది.. నీవల్లే గేమ్ ఓడిపోయాం అనిపించింది' అంటూ లోబోని నామినేట్ చేశాడు. యానీ మాస్టర్ - షణ్ముఖ్ ని నామినేట్ చేస్తూ.. జెస్సీ-శ్రీరామ్ ఫైట్ సమయంలో షణ్ముఖ్ ప్రవర్తన నచ్చలేదని రీజన్ చెప్పింది. ఆ తరువాత విశ్వని నామినేట్ చేస్తూ.. స్ట్రాంగ్ పాయింట్ ఇచ్చి నామినేట్ చేయండని చెప్పింది.
శ్రీరామచంద్ర - సిరిని నామినేట్ చేస్తూ.. బయాస్డ్ అనే వర్డ్ నచ్చలేదని రీజన్ చెప్పాడు. ఇక్కడున్న యాక్టర్స్ అందరికీ నటించడం వచ్చేమో కానీ అందరికీ రాదని.. 'మీ కన్వీనియన్స్ కోసం ఒక రిలేషన్షిప్ ని వాడుకోకండి' అని శ్రీరామ్ అన్నారు. తర్వాత ఆడినా ఆడకపోయినా షణ్ముఖ్‌ని ఎవరూ నామినేట్ చేయడంలేదంటూ అతడి ఫొటోను మంటల్లో వేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షణ్ణూ 'సో బేసిక్ గా నువ్ బిగ్ బాస్ హౌస్ కి దేవుడివి... నువ్వు ఏ రూల్ చెప్తే మేం అది పాటించాలి అంతేనా..?' అంటూ ప్రశ్నించాడు. కాజల్ - శ్రీరామచంద్రని నామినేట్ చేసింది. 'ఎమోషనల్ ఎటాచ్‌మెంట్ పెట్టుకోవడానికి నేను ఈ హౌస్ లోకి రాలేదు..' అంటూ ఫైర్ అయ్యింది. శ్వేతాను నామినేట్ చేస్తూ.. లాస్ట్ వీక్ నువ్ నన్ను నామినేట్ చేశావ్ అంటూ రీజన్ చెప్పింది.
షణ్ముఖ్.. శ్రీరామ్, లోబోలను నామినేట్ చేశాడు. తాను కించపర్చలేదని శ్రీరామ్‌ని, గత వారం తనని నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్ సరైనది కాదని లోబోని నామినేట్ చేశాడు. ప్రియా.. విశ్వ, సన్నీలను నామినేట్ చేసింది. విశ్వా కొన్ని సార్లు నోరు జారుతాడని, మేకప్ వేసుకోడమేకాదు, గేమ్ కూడా ఆడాలని తనని కామెంట్ చేశాడని విశ్వాని, సన్నీతో ఇంకా సమస్య పరిష్కారం కాలేదని తెలిపింది. దీంతో సన్నీ కూడా హౌస్‌లో వున్నన్ని రోజులూ తాను ప్రతి వారం ప్రియానే నామినేట్ చేస్తానని తెలిపారు. దానికి ప్రియా 'వార్నింగ్ ఇస్తున్నారా..?' అని అడగ్గా.. 'నా గేమ్ చెప్తున్నా' అంటూ రిప్లయ్ ఇచ్చాడు సన్నీ.
మొత్తంగా ఆరో వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు షణ్ముఖ్, ప్రియాంక, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీలు నామినేట్ అయ్యారు. అత్యధికంగా ఈ వారం పది మంది నామినేషన్లలో ఉండటం విశేషం. ఇక గత ఐదు వారాల్లో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments