బిగ్‌బాస్ 4... చిరు కుమ్మేశారు.. టీఆర్పీ దూసుకెళ్లింది

తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌.. ఇటీవలే సీజన్‌ 4ను కంప్లీట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. సీజన్-4లో ఇద్దరు, ముగ్గురు కంటెస్టెంట్లు తప్ప మిగిలినవన్నీ పెద్దగా తెలియని మొహాలే. దీంతో ఈ షో మొదట్లో విమర్శలను ఎదుర్కొంది. చాలా చెత్త టాక్‌ని సొంతం చేసుకుంది. ఒక్క వీకెండ్‌ మినహా.. ప్రేక్షకులను ఈ షో అలరించలేకపోయిందనే టాక్‌ నడిచింది. కానీ షో కొన్ని వారాలు గడిచిన తర్వాత ప్రేక్షకులు ఈ షోకు బాగా కనెక్ట్ అయ్యారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌కు మంచి పేరు వచ్చింది.

డిసెంబర్‌ 20న జరిగిన ఫైనల్‌లో బిగ్‌బాస్‌ 4 విన్నర్‌గా హీరో అభిజిత్‌ నిలవగా.. రన్నర్‌గా అఖిల్‌ నిలిచాడు. ఫొ చివర్లో మెగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి.. షోని ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు. ఒక్కొక్కరికీ బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తూ అద్భుతంగా చిరు ఆకట్టుకున్నారు. చిరు-నాగ్‌ల కాంబో ఫినాలేని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. అందుకే ఇండియా వైడ్‌గా ఇప్పటి వరకు జరిగిన అన్ని బిగ్‌బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్స్‌ను బీట్‌ చేసి.. రికార్డు స్థాయిలో 21.7 టీఆర్పీ రేటింగ్‌ను ఈ ఫైనల్‌ ఎపిసోడ్‌ సాధించినట్లుగా అధికారికంగా స్టార్‌ మా ప్రకటించింది.

ఈ ఫైనల్‌ ఎపిసోడ్‌కి వచ్చిన రికార్డ్‌ టీఆర్పీతో హోస్ట్ నాగార్జున ఫుల్ ఖుషీ అయ్యారు. దీంతో తన సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ''వావ్‌.. మీ ప్రేమకు ధన్యవాదాలు. మీరంతా ఆదరించకపోతే ఈ ఫైనల్‌ ఎపిసోడ్‌ ఇంత పెద్ద సక్సెస్‌ అయ్యేది కాదు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు, కంటెస్టెంట్‌లకు, బిగ్‌బాస్‌ యాజమాన్యానికి, చిరంజీవిగారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను'' అని కింగ్‌ నాగ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఫైనల్‌ ఎపిసోడ్‌ ఇంత పెద్ద హిట్‌ అవ్వడం పట్ల.. ఇప్పుడంతా హ్యాపీగా ఉన్నారు. ఈ ఆనందంలో త్వరలోనే సీజన్‌ 5ను కూడా ప్రకటన చేయనున్నారనే వార్తలు నడుస్తున్నాయి.

More News

రేపు దేశమంతటా డ్రైరన్

కరోనా వ్యాక్సినేషన్‌ సన్నద్ధతకు దేశమంతటా డ్రై రన్‌ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ఉన్నత

ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వాయిదా వేస్తున్నాం: ఈటల

కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన ఇబ్బందులన్నీ ఇప్పుడిప్పుడే కాస్త తొలుగుతున్నాయని ఆనందించే లోపే.. కోవిడ్ కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసింది.

'మెగా' తప్పిదానికి క్షమాపణ చెప్పిన ఒటిటి సంస్థ

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. లాక్‌డౌన్ కాలంలో ప్రేక్షకులు కామన్‌గానే ఓటీటీలకు అలవాటు పడిపోయారు. దీంతో ‘ఆహా’

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి

అనారోగ్యంతో సినీ నటుడు నర్సింగ్ యాదవ్ సోమజిగూడా యశోద ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు.

రిపబ్లిక్ గిఫ్ట్ రెడీ చేస్తున్న రాజమౌళి

ద‌ర్శ‌కధీరుడు ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తోన్న పిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’. ప్రీ ఇండిపెండెన్స్ ముందు అంటే 1920 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది.