వారం తిరగక ముందే హారిక కొట్టిన దెబ్బకు.. నామినేషన్స్‌లో మోనాల్
Send us your feedback to audioarticles@vaarta.com
‘రావే చేద్దాం దాండియా.. జర ఊగిపోదా ఇండియా’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఇక అభి చేసిన దోశలను బిగ్‌బాస్‌కు చూపించి మరీ సొహైల్ ఆట పట్టించడం చాలా ఫన్నీగా అనిపించింది. అభి కూడా నీ దోశ మాడిపోయిందంటూ సొహైల్‌ను ఆడుకున్నాడు. అఖిల్, మోనాల్‌ల మధ్య కాన్వర్సేషన్. తన ఆటపై ఎఫెక్ట్ చూపిస్తుందేమోనని భయంగా ఉందని.. కాబట్టి నీతో ఎంత దూరం ఉండాలో అంత దూరంగానే ఉంటానని చెప్పాడు. నువ్వెళ్లి మీ అక్కను మన గురించి బయట ఏమైనా అనుకుంటున్నావా? అని అడిగావని.. నేను అలా అడగలేదని చెప్పాడు. అమ్మాయివి కాబట్టి నీకు కాస్త ఎక్కువ భయం ఉండొచ్చని చెప్పాడు. నేను నార్మల్‌గా ఉండటానికి చాలా ట్రై చేస్తున్నానని.. కానీ ఉండలేక పోతున్నానని చెప్పాడు. నీకేదైనా హెల్ప్ కావాలంటే అడుగు చేస్తా.. కానీ నీతో ఇంతకు ముందులా ఉండలేనని చెప్పాడు.
ఇక అవినాష్ షర్ట్ వేసుకుంటుంటే.. నువ్వు షర్ట్ వేసుకోకు అవినాష్.. అంకుల్లా ఉన్నావని అరియానా ఆట పట్టించింది. అరియానాకు సొహైల్, అఖిల్ తోడయ్యారు. అంతే అవినాష్‌ని ఒక ఆట ఆడుకున్నారు. వీళ్ల నలుగురూ కలిసి ఓ రేంజ్లో ఫన్ జెనరేట్ చేశారు. ఇక నామినేషన్ ప్రక్రియ స్టార్ట్.. బజర్ మోగగానే ఇంటి సభ్యులంతా గార్డెన్ ఏరియాలోకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన టోపిలను పెట్టుకుని బిగ్‌బాస్ తదుపరి ఆదేశం వకచ్చే వరకూ ఫ్రీజ్ అవ్వాల్సి ఉంటుంది. రెడ్ వచ్చిన వాళ్లు నామినేట్ అవుతారు. గ్రీన్ వచ్చిన వాళ్లు సేఫ్. దీంతో నాలుగు ఏలు.. అభిజిత్, అరియానా, అఖిల్, అవినాష్ నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన నలుగురు సభ్యులను తలొక శవ పేటికలో నిలబడమని బిగ్‌బాస్ చెప్పారు. నామినేషన్ ప్రక్రియ రెండో లెవల్లో భాగంగా బిగ్‌బాస్ చెప్పిన ఆర్డర్లో తాను ఇంట్లో ఉండేందుకు ఎందుకు అర్హులు.. బయట ఉన్నవారు ఎందుకు అనర్హులో చెప్పి వారిని తమ స్థానంలో నామినేట్ అయ్యేందుకు ఒప్పించాలి.
ముందుగా అవినాష్.. సొహైల్‌ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ సమయంలో సొహైల్ రిస్క్ చేయబోనని తేల్చి చెప్పాడు. తరువాత మోనాల్‌ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. మోనాల్ కూడా అంగీకరించలేదు. నీకంటే షోకి నేను 200 పర్సెంట్ అర్హుడినని చెప్పాడు. మోనాల్ కూడా బాగానే వాదించింది. ఇద్దరి మధ్య వాదన గట్టిగానే జరిగింది. తను నామినేట్ అవడాన్ని అవినాష్ తీసుకోలేకపోతున్నాడని అతని మాటల బట్టి అర్థమవుతోంది. ఇక అఖిల్ వంతు.. మోనాల్‌ను అడిగాడు. నువ్వే నన్ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పావు కదా.. నీకంటే నేను డిజర్వ్ కాబట్టి మార్చుకోమని చెప్పాడు కానీ మోనాల్ వినలేదు. ఇద్దరి మధ్య ఓ రేంజ్లో చర్చ జరిగింది. ఇక అరియానా.. సొహైల్‌తో మొదలు పెట్టింది. నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చెయ్యలేదు కాబట్టి చెయ్యమని అడిగింది. నన్ను ఫ్రెండ్‌లా చూస్తే నేను నిన్ను నామినేట్ చేస్తే నువ్వు నన్నెందుకు చేశావని సొహైల్ అడిగాడు. మొత్తమ్మీద సొహైల్ నో చెప్పేశాడు. తరువాత మోనాల్‌ను అడిగింది. నీతో కంపేర్ చేస్తే నేను చాలా బాగా చేశానని చెప్పింది. అరియానాకు, మోనాల్‌కు మధ్య చర్చ జరుగుతుంటేనే.. సొహైల్, అఖిల్‌ల మధ్య సైగలు.. సొహైల్ వెళ్లి నేనుంటా నామినేషన్స్‌లో బయటకు రారా.. అన్నప్పటికీ అఖిల్ రానని చెప్పాడు. అటు సొహల్, ఇటు అఖిల్.. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకోవడంతో వారి ఫ్రెండ్షిప్ పవర్‌ని చెప్పకనే చెప్పినట్టు అనిపించింది.
ఇక అరియానాకు, మోనాల్‌కు మధ్య ఓ రేంజ్లో వార్ జరిగింది. మధ్యలో అవినాష్ కూడా రావడంతో మరింత ముదిరింది. మొత్తానికి మోనాల్ కొట్టిన దెబ్బ అఖిల్ కైతే ఓ రేంజ్లో తగిలినట్టు అనిపించింది. నాకోసం ఇక్కడున్న వారెవరూ ఆడలేదనడంతో అఖిల్ కల్పించుకుని నేను నీకోసం ఆడానని గుర్తు చేశాడు. దీనికి వెటకారంగా బాగా ఆడావని చెప్పింది. ఇక అభి.. మోనాల్ మదర్ వచ్చి తన గురించి పాజిటివ్‌గా చెప్పిన మాటలను గుర్తు చేసుకుని నిన్ను నేను అడగకలేక పోతున్నానని చెప్పాడు. ఫైనల్‌గా హారికకు తన కెప్టెన్సీ పవర్‌ని ఉపయోగించి ఒకరిని స్వాప్ చేయాలని కోరడంతో మోనాల్‌ను ఈ రెండు మూడు వారాల నుంచి నీ గేమ్ కనిపిస్తోందని.. అభితో స్వాప్ చేసింది. కారణాలేమైతే ఏమి..తనను కెప్టెన్‌ని చేసిన మోనాల్‌ను అదే కెప్టెన్సీ పవర్‌తో వారం తిరగక ముందే హారిక దారుణంగా దెబ్బ కొట్టింది. ఫైనల్‌గా అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్ నామినేట్ అయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments