బోర్ కొట్టించిన సండే.. లాస్య ఎలిమినేట్..

  • IndiaGlitz, [Monday,November 23 2020]

సండే.. ఫన్‌డే.. లాస్య ఎలిమినేషన్ తప్ప చెప్పుకోదగ్గ అంశాలేమీ లేవు. బోర్ కొట్టించే ఫన్ తప్ప.. ఆకట్టుకునేంత అయితే లేదు. నైస్ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇక నాగ్ కాస్ట్యూమ్‌ని కంటెస్టెంట్లు ప్రశంసించారు. సండే ఫన్‌డే‌లో భాగంగా.. కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఒక టీంకు కెప్టెన్‌ను హారిక.. మరో టీంకు కెప్టెన్‌గా అరియానాను సెలక్ట్ చేశారు. బజర్ ప్రెస్ చేసిన వాళ్లు పాట చెప్పాలి. అరియానా టీం నుంచి సొహైల్.. హారిక టీం నుంచి అఖిల్ వచ్చాడు. మొదటి సాంగ్‌కు అరియానా టీం చెప్పింది. నెక్ట్స్ బజర్‌ను అఖిల్ నొక్కాడు. హారికను ఆరుడుగుల బుల్లెట్ అంటూ నాగ్ ఫన్ చేశారు. మంచి మంచి గ్రేస్‌ఫుల్ సాంగ్స్‌తో ఫన్నీ ఫన్నీగా ఈ రౌండ్ నడిచింది. ఈ రౌండ్‌లో రెండు పాటలు మిగిలి ఉండగానే హారికను నాగ్ సేఫ్ చేశారు. హారిక యు ఆర్ సేఫ్ అనగానే ఎలా చేస్తుందో చూపించమని అవినాష్‌ని నాగ్ అడగితే హారికలాగే చేసి చూపించి నవ్వించాడు. ఈ రౌండ్‌ను హారిక టీం విన్ అయ్యింది.

రెండో రౌండ్‌లో గేమ్‌కు ముందు నాగ్.. మోనాల్‌ను సేఫ్ చేశారు. రెండో రౌండ్‌లో లూడో గేమ్.. కలర్‌ వస్తే యాక్టివిటీ చేయాలి. సొహైల్ నెయిల్ పాలిష్‌ను నోటితో వేశాడు. ఒక రొమాంటిక్ సాంగ్‌ని అఖిల్ పాడగా.. నాగ్ శాడ్‌గా.. ఫాస్ట్‌గా.. స్లో మోషన్‌లో పాడి అలరించాడు. అవినాష్ ఒక్క నిమిషంలో చీర కట్టుకుని చూపించాడు. తరువాత నిమ్మకాయను ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా తిన్నాడు. ఈ రౌండ్‌ను అరియానా టీం విన్ అయ్యింది. తరువాత అభిని నాగ్ సేఫ్ చేశారు. ఇక నామినేషన్స్‌లో లాస్య, అరియానా మిగిలిపోయారు. ఇద్దరినీ నాగ్ మిర్రర్ ముందు నిలబెట్టారు. ఎవరి బొమ్మపై లైట్ వస్తుందో వారు సేఫ్.. రాని వాళ్లు ఎలిమినేట్ అవుతారు. ఫైనల్లీ లాస్య ఎలిమినేట్ అయ్యింది. అయినప్పటికీ ఏమాత్రం లాస్య షాక్ అవలేదు. దీనినే నాగ్ అడిగారు. కొన్నిసార్లు ప్రిడిక్షన్ చేస్తుంటానని ఇవాళ కూడా తనకు తెలిసిందని లాస్య చెప్పింది. లాస్య జర్నీ.. ఎక్కువగా ఫన్నీ అంశాలతోనే రూపొందించారు. జర్నీలో కొడుకు జున్నూని చూడగానే లాస్యకు ఏడుపు ఆగలేదు.

సేఫ్ ఆడకుండా టాప్ 2లో ఎవరుంటారో చెప్పమని లాస్యను నాగ్ అడిగారు. సొహైల్, అభిజిత్ టాప్‌ 2లో ఉంటారని లాస్య చెప్పింది. అవినాష్.. ఇంట్లో ఎంటర్‌టైనర్ అని.. నామినేషన్‌లో తనని ఎవరైనా ఏమైనా పాయింట్స్ చెబితే తీసుకోడని లాస్య చెప్పింది. మోనాల్ చాలా బాగా ఆడుతుంది కానీ ఒక్కోసారి కన్ఫ్యూజింగ్‌లో ఉంటుందని చెప్పింది. అరియానా చాలా బోల్డ్‌గా మాట్లాడుతుందని.. అయితే తనది రాంగ్ అయినప్పుడు ఒప్పుకుంటే బాగుంటుందని చెప్పింది. సొహైల్ ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కూల్ అవతాడని చెప్పింది. కోపాన్ని తగ్గించుకో అని లాస్య చెప్పింది. అఖిల్.. బాగా ఆడుతున్నాడని.. కానీ నామినేషన్స్‌లో చాలా అగ్రెసివ్‌గా ఉంటాడని.. ఓపిగ్గా విని తర్వాత మాట్లాడితే బాగుంటుందని లాస్య చెప్పింది. అభి.. అందరినీ సమానంగా చూస్తాడని చెప్పింది. హారిక.. ఏదైనా.. ఎంత కష్టమైనా సాధిస్తుందని చెప్పింది. ఇక బిగ్‌బాంబ్.. కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్‌ ది కిచెన్ అని ఒకరికివ్వాలని నాగ్ చెప్పారు. దానిని లాస్య అభికి ఇచ్చింది. నాలుగు వారాలే గట్టిగా ఆడాలని నాగ్ చెప్పారు.

More News

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన యాప్రాల్ ప్రజలు..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రజాప్రతినిధులను కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు.

హైదరాబాద్‌లోనే పెద్ద సినీ పరిశ్రమ.. అండగా ఉంటాం: కేసీఆర్

తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని  చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో షూట్‌లో జాయిన్‌ అయిన  హాలీవుడ్‌ స్టార్స్‌

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో

నాని ‘శ్యామ్ సింగరాయ్’ స్టోరీ ఇదేనట...

నేచురల్ స్టార్ నాని లాక్‌డౌన్ తర్వాత మరింత స్పీడ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుని షూటింగ్‌లు కానిచ్చేస్తున్నాడు.

వారిని మెప్పించిన పార్టీకే జీహెచ్ఎంసీ పీఠం!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.