బిగ్‌బాస్ 4 .. ఈ వారం ఎలిమినేటర్ ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4లో మూడో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు రెండు ఎలిమినేషన్స్ జరిగాయి. తొలివారం దర్శకుడు సూర్యకిరణ్, రెండో వారంలో నటి కల్యాణి ఎలిమినేట్ అయ్యారు. వీరి ఎలిమినేషన్‌తో పాటు ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ముందుగా కుమార్ సాయి, తర్వాత అవినాష్, రీసెంట్‌గా స్వాతి దీక్షిత్ ఉన్నారు. ఇప్పుడు మూడో ఎలిమినేటర్ ఎవరనే దానిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మూడో ఎలిమినేషన్‌కు సంబంధించిన నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి.
ఈ వారం అరియానా, దేవి, మెహబూబ్, కుమార్ సాయి, మోనాల్, లాస్య, హారికలు నామినేషన్స్ ఎంపికయ్యారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు మేరకు ఈ వార్తలు మెహబూబ్ ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు. ఈ వారం మనుషులు, రొబోట్స్ అంటూ చేసి టాస్క్‌లో మెహబూబ్ చేసిన ఓవరాక్షన్ వల్లనే మెహబూబ్‌కు తక్కువ ఓట్లు పడ్డాయని, అందుకే తను ఎలిమినేట్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలెంటే తెలియాలంటే కొన్ని గంటలు వెయిటింగ్ తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments