అమ్మో రాజశేఖర్.. బీభత్సం చేసేశాడు..
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్నటి నామినేషన్ పర్వం నేడు కూడా కొనసాగింది. నిన్న అవినాష్‌ని అభి నామినేట్ చేశాడు. ఇవాళ అమ్మ రాజశేఖర్‌ను నామినేట్ చేశాడు. కామన్‌గానే ఎవరైనా అమ్మను నామినేట్ చేస్తే ఆయన తీసుకోలేరు. ఇవాళ కూడా అలాగే ఫీల్ అయ్యాడు. అసలు అభి కారణాన్ని చెప్పనివ్వలేదు. పబ్లిక్ ముందు బ్లేమ్ చేయవద్దని అమ్మ.. మీరు వచ్చిందే పబ్లిక్ షో అని అభి చెప్పాడు. నోయెల్ మేటర్ తీసుకువచ్చి అసలు అభిని మాట్లాడనివ్వలేదు. నా లైఫ్‌ని అవమానం చేస్తున్నారు. ఈ మధ్యలోకి అవినాష్ వచ్చాడు. హారిక వచ్చి అవినాష్ నువ్వు మాట్లాడవద్దని చెప్పడంతో నువ్వెవరు.. నువ్వు నోర్మూసుకో అని అమ్మ అనడం చాలా టూమచ్‌గా అనిపించింది. ఇవాళ కూడా అమ్మ రాజశేఖర్ కేరెక్టర్‌పైకి వెళ్లిపోయి అభిని దూషించారు. అక్కడితో ఆగకుండా ఇక నేనెవ్వరినీ నామినేట్ చేయనంటూ హైడ్రామా మొదలు పెట్టారు. తరువాత హారిక వచ్చి అవినాష్‌ని నామినేట్ చేసింది. తరువాత అమ్మ రాజశేఖర్‌ని నామినేట్ చేసింది. కారణాలు చెప్పనివ్వకుండా వాదించడం స్టార్ట్ చేశారు. బిగ్‌బాస్ కారణాలు చెప్పాలన్నారు అని చెప్పినా వినిపించుకోకుండా వాదన స్టార్ట్ చేశారు. హారిక కూడా గట్టిగానే అమ్మకు సమాధానం చెప్పింది.
తరువాత లాస్య.. అవినాష్, మోనాల్‌ను నామినేట్ చేసింది. ఇక మోనాల్.. సొహైల్‌ను నామినేట్ చేసింది. అఖిల్ పేరు తీయడంతో తన పేరు తీయవద్దని అఖిల్ చెప్పాడు. తరువాత లాస్యను నామినేట్ చేసింది. తరువాత అమ్మ.. అభిని నామినేట్ చేశాడు. నన్ను ఆశీర్వదిస్తున్నారని మాస్టర్ మీరు అంటూ సెటైరికల్‌గా అన్నాడు. నువ్వు నోయెల్‌కు ప్రామిస్ చేసి ఉంటావు అందుకే నన్ను నామినేట్ చేశావని మళ్లీ మొదలు పెట్టాడు. నోయెల్ ఎంతో.. మీరూ అంతేనని అభి చెప్పాడు. తరువాత అఖిల్‌ను నామినేట్ చేశాడు. నేను వెళ్లాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు వెళ్లాలని నేను కోరుకుంటున్నానని ఓ సిల్లీ రీజన్‌ను అమ్మ చెప్పారు. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకు నవ్వుతారని అఖిల్ చెప్పాడు. తరువాత మెహబూబ్.. హారిక, అవినాష్‌లను నామినేట్ చేశాడు. ఇక అఖిల్.. అమ్మను నామినేట్ చేశాడు. తరువాత అందరికీ షాకింగ్‌గా మోనాల్‌ను అఖిల్ నామినేట్ చేశాడు. గేమ్‌లో క్లారిటీ లేదని... కన్ఫ్యూజన్‌లో ఉంటున్నావని చెప్పాడు. మరోవైపు అమ్మ రాజశేఖర్ వాడేంటిరా మోనాల్‌ని నామినేట్ చేస్తున్నాడు.. తప్పురా అది అనడం మరో టూమచ్. ఇక అమ్మ రాజశేఖర్, అవినాష్, అభిజిత్, మోనాల్, హారిక నామినేట్ అయ్యారు. ఆ తరువాత అమ్మ.. సిట్యువేషన్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. మోనాల్‌ను కూర్చోబెట్టి మాట్లాడారు. చాలా సింపతి కురిపించారు. అయితే అమ్మాయి.. అబ్బాయి మధ్య ఫ్రెండ్‌షిప్ అంటే మోర్ కావాలని అనడం ఏమాత్రం సబబుగా అనిపించలేదు. అమ్మ మాత్రం మోనాల్‌కు ఓ రేంజ్‌లో అభయహస్తం ఇచ్చేశారు.
అఖిల్ బయట పడుకుని ఉంటే మోనాల్ వెళ్లి బెడ్ షీట్ కప్పింది. అయితే నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని సేవ్ అవడానికి ఒక ఛాన్స్ బిగ్‌బాస్ ఇచ్చారు. నామినేట్ అయిన ఐదుగురు టీ స్టాండ్‌పై మొహం పెట్టి నిలబడాలి. వారిని సేఫ్ చేసుకునేందుకు మిగిలిన సభ్యులు ఏం చేసినా టీ స్టాండ్‌పై నుంచి ఒక్కసారి మాత్రమే తల బయటకు తీయడానికి ఛాన్స్ ఉంది. ఇక కంటెస్టెంట్‌లంతా నామినేషన్స్‌లో ఉన్నవారిని టీ స్టాండ్ నుంచి తప్పించడానికి చాలా ట్రై చేశారు. ఎక్కువగా అంతా మోనాల్‌నే ట్రై చేశారు. మోనాల్ కళ్లలోకి మట్టి పోయిందని అఖిల్ వెళ్లి కళ్లు తుడిచాడు. దీనికి సొహైల్ సీరియస్ అయ్యాడు. తరువాత కావాలని సొహైల్, మెహబూబ్ వెళ్లి కావాలని మోనాల్ నెత్తిపై మట్టి వాటర్ పోశారు. తరువాత టవల్‌తో అమ్మను కవర్ చేసే ప్రయత్నం మెహబూబ్ చేశాడు. ఈ నేపథ్యంలో సొహైల్, మెహబూబ్ కలిసి అఖిల్‌పై గొడవకు వెళ్లారు. ఆడండి అని చెప్పి అఖిల్ వెళ్లిపోయి కూర్చొన్నాడు. తరువాత మళ్లీ వచ్చి ఆడాడు. ఎండ్ బజర్ మోగే సమయానికి ఒకరి కంటే ఎక్కువ టీ స్టాండ్‌పై ఉంటే ఎవరికీ ఇమ్యూనిటీ లభించదని బిగ్‌బాస్ చెప్పారు. అభి టీ స్టాండ్ పైనుంచి వెళ్లిపోయాడు. తరువాత హారిక రెండోసారి మొహం టీస్టాండ్ నుంచి తీయడంతో ఆమె అవుట్ అయింది. అయినా ఇంకా టీస్టాండ్‌పై ముగ్గురు ఉండటంతో ఎవరికీ ఇమ్యూనిటీ లభించలేదని బిగ్‌బాస్ చెప్పారు. మొత్తానికి ఇవాళ షోలో అమ్మ రాజశేఖర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మొత్తానికి బీభత్సం చేసేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments