సూసైడ్ చేసుకోవాలనుకున్నానన్న అవినాష్.. మోనాల్‌పై నమ్మకం లేదన్న అఖిల్

  • IndiaGlitz, [Saturday,October 10 2020]

ఇవాళ షో మొత్తాన్ని అవినాష్ కంప్లీట్‌గా హ్యాండోవర్ చేసుకున్నాడు. ఎక్కువ స్క్రీన్ స్పేస్ అవినాష్‌కే దక్కింది. చూసే వాళ్లకే కాదు.. కంటెస్టెంట్లలో కూడా మంచి జోష్‌ని నింపాడు. ఇక షో విషయానికి వస్తే.. మార్నింగ్ మస్తీలో భాగంగా.. తన తల్లి గురించి నోయెల్ వివరించాడు. గొప్ప వ్యక్తిగా చనిపోవాలని లేదని.. కానీ తన తల్లి ఎంతగా ప్రేమించాడు అనుకుంటే చాలని నోయెల్ చెప్పాడు. నోయెల్ మాటలకు లాస్య బాగా కనెక్ట్ అయింది. అవినాష్ తన పేరెంట్స్ గురించి చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్‌లో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని.. అవినాష్ చెప్పాడు. తను ఇల్లు కొన్నానని.. 40 వేలకు పైగా ఈఎంఐ కట్టాల్సి వచ్చిందని.. అదే సమయంలో తన తండ్రి, తల్లి అనారోగ్యం పాలయ్యారని ఇంటి కోసం దాచిన డబ్బును వారి కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నానని అవినాష్ చెప్పుకొచ్చాడు. పేరెంట్స్‌ను బాగా చూసుకోవాలని ప్రతి ఒక్కరికీ సూచించాడు. గంగవ్వ ఐదేళ్లకే పెళ్లైందని.. 17 ఏళ్లకు తనకు కొడుకు పుట్టాడని చెప్పింది. తనను బాగా కొట్టేవాడని చెప్పింది. తన భర్త ఆ తర్వాత మస్కట్‌కు వెళ్లాడని.. తన పిల్లలకు పెళ్లి కాలేదని అంతా అనేవారంటూ తన ఆవేదనంతా చెప్పుకొచ్చింది. తన కూతురు చనిపోయిన విధానాన్ని వివరించి గంగవ్వ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది.

సూసైడ్ చేసుకుందామనుకున్న అని అవినాష్ చెప్పిన మాటలకు అమ్మ రాజశేఖర్ బాగా హర్ట్ అయినట్టున్నారు. తరువాత అవినాష్‌కి క్లాస్ పీకారు. ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను అఖిల్, మెహబూబ్‌లకు సొహైల్ అప్పజెప్పాడు. పోయిన సారి లగ్జరీ బడ్జెట్ విషయంలో కంటెస్టెంట్‌ల ఆగ్రహానికి గురయ్యాడు కాబట్టి ప్రూవ్ చేసుకునేందుకు అఖిల్‌కు ఇస్తున్నట్టు సొహైల్ చెప్పాడు. ఏది ఏమైనా సొహైల్ లాజిక్ బాగుంది. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో మెహబూబ్ గెలుపొంది అశ్వని హెయిర్ ఆయిల్ గిఫ్ట్ హ్యాంపర్‌ను సొంతం చేసుకున్నాడు. గత వారం అందరూ తనను లగ్జరీ బడ్జెట్ గురించి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లగ్జరీ బడ్జెట్‌ను అంతా తింటున్నారని మోనాల్‌కు అఖిల్ చెప్పాడు. దేవుడిపై చాలా నమ్మకముందని నీపై లేదని మోనాల్‌కు అఖిల్ చెప్పడం విశేషం. సొహైల్ పడుకుంటే కుక్కలు అరవడం ఫన్నీగా అనిపించింది. నెక్ట్స్ మరో టాస్క్. బిగ్‌బాస్ ఆత్మను రప్పించేందుకు యత్నించాలి. ఆ సమయంలో బిగ్‌బాస్ అవినాష్‌ ఒంట్లోకి వస్తారు. అప్పుడు బిగ్‌బాస్‌ను కంటెస్టెంట్లు ఎలాంటి ప్రశ్నలైనా అడగవచ్చు.

కంటెస్టెంట్లు అడిగిన ప్రశ్నలకు చాలా ఫన్నీగా అవినాష్ ఒంట్లోకి వచ్చిన బిగ్‌బాస్ చెప్పారు. ఆ తరువాత అందరినీ సోఫాలో కూర్చోబెట్టి ఒక్కొక్కరి గురించి చెప్పి బాగా నవ్వించాడు. గంగవ్వకు ధైర్యం చెప్పారు. దివి బిగ్‌బాస్‌కి ఐ లవ్ యూ చెప్పింది. అప్పుడు అవినాష్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి. ఈ వయసులో కూడా చక్కగా ఆడుతున్నారని అమ్మ రాజశేఖర్‌కు అవినాష్ ఒంట్లోకి వచ్చిన బిగ్‌బాస్ చెప్పారు. అప్పుడు అమ్మ రాజశేఖర్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా ఫన్నీగా అనిపించాయి. అవినాష్ లాన్‌లో కంటెస్టెంట్ నడకను అనుకరిస్తూ బాగా కామెడీ చేశాడు. అమ్మ రాజశేఖర్ స్మోకింగ్ జోన్‌లో పాట స్టార్ట్ చేశాడు. అవినాష్ నమ్మొద్దు.. నమ్మొద్దు ఆడవాళ్లను నమ్మొద్దంటూ సాంగ్ స్టార్ట్ చేశాడు. ఆ సాంగ్‌కి దివి బాగా కనెక్ట్ అయింది. ఇక అఖిల్ మొన్న కనిపించావు అంటూ సాంగ్ స్టార్ట్ చేశాడు. మొత్తానికి ఫుల్ కామెడీగా కామెడీగా నడిచింది. దివి.. అఖిల్, అభి గురించి మీటింగ్ పెట్టి మరీ మోనాల్‌కి చెబుతూ బ్రెయిన్ వాష్ చేసేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న అమ్మ రాజశేఖర్‌ దివికి వంత పాడారు. మొత్తానికి ట్రయాంగిల్‌కి ఫుల్ స్టాప్ పెట్టేందుకు దివి తన వంతు ప్రయత్నమైతే చేస్తోంది ఏం జరుగుతుందో చూడాలి.

More News

అన్‌లాక్ 5.0 నిబంధనలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

కేంద్రం జారీ చేసిన అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

రాఘవేంద్రుడి 'పెళ్లి సందడి' మళ్లీ మొదలు కాబోతోంది

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అద్భుత సృష్టి ‘పెళ్లి సందడి’ గుర్తుంది కదా.. 1996లో శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

అల్లు అర్జున్, రానాలు నా ప్రయాణాన్ని అద్భుతం చేశారు: అనుష్క

లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో అనుష్క దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 'అరుంధతి'తో మొదలైన అనుష్క లేడీ ఓరియంటెడ్ మూవీస్ ప్రయాణం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల నుంచీ 'ఎక్స్‌పైరీ డేట్‌'కి మంచి స్పందన లభిస్తోంది! - మధు షాలిని

స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్'‌. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్

జగన్ కేసుల విచారణ సోమవారానికి వాయిదా

ఏపీ ముఖ్యమంతి జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసు విచారణ సీబీఐ కోర్టులో శుక్రవారం జరిగింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ