కెప్టెన్‌గా సొహైల్.. మోనాల్ విషయంలో స్ట్రాంగ్‌గా అఖిల్ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ వారం కెప్టెన్సీ టాస్క్ డిజైన్ చేసిన వారి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అలా వెరైటీగా డిజైన్ చేశారు. ఇక కెప్టెన్సీని సొహైల్ దక్కించుకున్నాడు. టాస్క్‌లో అభి కాయిన్స్ తీసుకోవడంపై హారిక నోయెల్‌కి చెప్పి హారిక బాధపడింది. దొంగని అక్కడ దొంగతనం జరిగింది నీకు తెలుసా అంటే నాకు తెలుసు.. నేనే కొట్టేశా అని చెబుతాడా? చెప్పడుగా.. మెహబూబ్ స్టార్స్ ఎక్కడున్నాయని కొట్టేసిన అభినే అడగడం ఫన్నీగా అనిపించింది. సీజన్ 2లో సేమ్ సీన్ జరిగింది. స్టార్స్‌ని కౌశల్ కొట్టేసి తన దగ్గర పెట్టుకున్నాడు. సేమ్ స్ట్రాటజీని అభి కూడా ఫాలో అయ్యాడు. ఇంటెలిజెంట్ బాయ్ కాబట్టి బాగా పట్టేశాడు. అవినాష్ పాటలతో సందడి సందడి చేస్తుండగానే టాస్క్ ముగినట్టు బిగ్‌బాస్ తెలిపారు. హోటల్ టీం గెస్ట్ టీంల ద్వారా ఎన్ని పాయింట్స్ పొందారో చెప్పాలని బాగ్‌బాస్ అడిగారు. హోటల్ టీంకి ఒక్క స్టార్ ఇచ్చామని హారిక చెప్పింది. మాకు దు స్టార్స్ ఇచ్చారని అభి చెప్పారు. ఈ నేపథ్యంలో అతిథులు, గెస్ట్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. అభిని ఎన్ని స్టార్స్ ఇచ్చారని బిగ్‌బాస్ అడగ్గా.. ఫైవ్ స్టార్స్ అని అభి చెప్పాడు. ఈ టాస్క్‌లో స్టార్స్ గెస్ట్ టీం ఇవ్వలేదని.. కాబట్టి గెస్ట్ టీంని విజేతలుగా బిగ్‌బాస్ ప్రకటించారు. గెస్ట్ టీం ఒక బెస్ట్ ప్లేయర్‌ని సెలక్ట్ చేసి చెప్పమని బిగ్‌బాస్ అడిగారు.
గంగవ్వ మెహబూబ్‌కి ఓటేయగా.. అరియానా కూడా మెహబూబే అని చెప్పింది. సొహైల్.. మెహబూబ్‌ను తనకు సపోర్ట్ చేయమని కోరాడు. ఈ సమయంలో ఇద్దరూ కాసేపు చర్చించుకున్నారు. లాస్ట్ టైమ్ నేను నీకు సపోర్ట్ ఇచ్చాను. ఈసారి నాకు సపోర్ట్ చేస్తే చెయ్యి.. లేదంటే లేదని సొహైల్ తెగేసి చెప్పాడు. ఫైనల్‌కు అంతా సొహైల్ పేరు చెప్పారు. దీంతో కెప్టెన్సీ టాస్క్‌లో సొహైల్ నిలిచాడు. అఖిల్ దగ్గర అందరి కంటే ఎక్కువ డబ్బుండటంతో రెండవ కెప్టెన్సీ పోటీ దారుడిగా నిలిచాడు. అవినాష్‌కి సీక్రెట్ టాస్క్ ఇచ్చిన విషయాన్ని బిగ్‌బాస్ రివీల్ చేశారు. అవినాష్ ఆ సీక్రెట్ టాస్క్‌లో విజయవంతమయ్యాడని చెప్పి.. మూడో కెప్టెన్సీ దారుడిగా ప్రకటించారు. వరస్ట్ పెర్ఫార్మర్ పేరు చెప్పమనగానే తానేనని అమ్మ రాజశేఖర్ ఒప్పుకున్నారు. దీంతో ఉల్లిపాయలు కట్ చేసి ఇవ్వాలని పనిష్మెంట్ ఇచ్చారు. ఇక అవినాష్ సీక్రెట్ టాస్క్‌లో భాగంగా చేసిన పనులన్నీ అందరికీ చెప్పాడు. కిచెన్ నుంచి వెళ్లిపోతామని లాస్య వాళ్లు కెప్టెన్ కుమార్‌కు చెప్పారు. కుమార్ వెళ్లి అమ్మ రాజశేఖర్‌కు చెప్పగా వెళ్లిపొమ్మన్నారు.
అఖిల్‌కి సుజాత అన్నం తినిపించడం విచిత్రంగా అనిపించింది. వీళ్లిద్దరి మధ్య ఇంత మంచి కమ్యూనికేషన్‌ను ఇప్పటి వరకైతే చూడలేదు. ఇక కెప్టెన్సీ టాస్క్ పేరు.. మంచు నిప్పు.. మధ్యలో ఓర్పు.. ఏం ప్లాన్ చేశాడుగా బిగ్‌బాస్.. నిజంగా చాలా ఓర్పుంటేనే చెయ్యగలరు. చాలా టఫ్‌గా దీనిని డిజైన్ చేశారు. ముందుగా అఖిల్ గివ్ అప్ ఇచ్చేశాడు. ఫైనల్‌గా కెప్టెన్సీ టాస్క్‌లో సొహైల్ విన్ అయ్యాడు. మళ్లీ మోనాల్ మొదలుపెట్టింది. నేనేం చేశా. నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని అఖిల్‌ని అడిగింది. చూడబోతే మోనాల్‌తో మాట్లాడొద్దని అఖిల్ స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినట్టు అనిపించింది. అఖిల్ ఏమీ మాట్లాడక పోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అఖిల్ ఎందుకో గానీ ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దివి హైట్ గురించి అవినాష్, సొహైల్, మెహబూబ్, అరియానా మీటింగ్.. దివి ఎలా నడుస్తుందో చూపించాడు. అందరికీ ఒకరు గట్టి సపోర్ట్ ఉన్నారని.. మనకే ఎవరి సపోర్ట్ లేదని మెహబూబ్ సొహైల్‌కి చెప్పాడు. మెహబూబ్ మాట్లాడుతుంటే ఏదో స్కూల్ పిల్లోడు మాట్లాడినట్టు అనిపిస్తుంది. దివికి అమ్మ రాజశేఖర్ తోడున్నారు. మోనాల్‌కి అఖిల్ ఇలా ఒక్కొక్కరికి.. ఒక్కొక్కరు తోడున్నారని చెప్పినప్పుడు మెహబూబ్‌కి సొహైల్ తోడున్నట్టేగా.. మనకే ఎవరు లేరని చెప్పడమేంటో.. మొత్తానికి ఇవాళ ఒక్క కెప్టెన్సీ టాస్క్ మాత్రమే హైలైట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com