జంబలకిడి పంబ అదుర్స్.. అందరూ సేఫ్..
Send us your feedback to audioarticles@vaarta.com
స్వాతి నిన్న ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. స్టేజ్ పైకి వచ్చిన తరువాత అందరికీ ఒక్కో బోర్డు ఇచ్చి ప్రతి ఒక్కరి గురించి వివరించింది. ఆమె వివరించే విధానం చూస్తుంటే ఒక్క వారంలోనే అందరినీ బాగా అర్థం చేసుకున్నట్టు అనిపిస్తోంది. ఇక బిగ్‌బాంబ్.. అది ఎవరిపై వేస్తే వాళ్లకు వచ్చే వారం కెప్టెన్సీ రేసులో పార్టిసిపేట్ చెయ్యడానికి వీలు లేదు. దానిని స్వాతి.. అమ్మ రాజశేఖర్‌పై వేసింది. ఇంక నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నారని నాగ్ చెప్పారు. రోల్ రివర్స్ గేమ్.. బిగ్‌బాస్ హౌస్‌లో జెండర్ పక్షపాతమనేది లేదని ఎవరైనా ఒకటేనని చెప్పడంలో భాగంగా ఈ గేమ్ ఆడిస్తున్నట్టు నాగ్ చెప్పారు. చాలా రోజులుగా గొడవలు తప్ప మాటలు లేని అభి.. అఖిల్ మాత్రం ఈ సందర్భంగా కాస్త కలిసినట్టు అనిపించారు.
సండే.. ఫన్డేలో భాగంగా జంబలకిడి పంబ.. అమ్మాయిలు.. అబ్బాయిలుగా.. అబ్బాయిలు.. అమ్మాయిలుగా మారిపోయారు. అంతా చాలా ఫన్నీగా అనిపించారు. ఒకరికొకరు ర్యాంగింగ్ చేసుకోవడం చాలా ఫన్నీగా అనిపించింది. ఇక డ్యూయెట్ సాంగ్స్‌కి డ్యాన్స్.. మెహబూబ్ లాస్య ఇరగదీశారు. అమ్మాయిగా కూడా మెహబూబ్.. మంచి గ్రేస్‌తో డ్యాన్స్ చేశాడు. నెక్ట్స్ ఖుషీ సినిమాలో నడుము చూసే సీన్.. అవినాష్, హారికలు.. ఏదో చేశారు. అఖిల్, మోనాల్.. దివాళీ దీపాన్ని సాంగ్‌కి డ్యాన్స్. మంచి గ్రేస్‌తో చేశారు. చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి, సొందర్యల మధ్య కవిత చదివి వినిపించే సీన్... అమ్మ రాజశేఖర్, సుజాత చేసి చూపించారు. చాలా బాగా వచ్చింది. నెక్ట్స్.. గంగవ్వ, కుమార్ సాయి.. రత్తాలు వస్తావా.. సాంగ్‌కి డ్యాన్స్.. చాలా ఫన్నీగా అనిపించింది. అతడు సినిమాలో మహేష్.. త్రిషల మధ్య సీన్.. నోయెల్, దివి చేశారు. ఇద్దరూ చాలా బాగా చేశారు. ఓసోసి రత్తాలు సాంగ్‌కి అరియానా, సొహైల్‌ల డ్యాన్స్.. నెక్ట్స్ నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి నా కళ్లు సాంగ్‌కి అభి, హారిక డ్యాన్స్.. మొత్తానికి జంబలకిడి పంబ ఫన్నీగానే అనిపించింది.
మిమ్మల్ని ఇలా చూసి నాకు ఏం కలలొస్తాయో.. ఏంటో అంటూ నాగ్ అందరినీ ఆట పట్టించారు. సాంగ్‌కి.. సొహైల్, అరియానాలకు.. సీన్లో అమ్మ రాజశేఖర్, సుజాతలకు.. చీరంతా ఊడిపోయినా బాగి చేసినందుకు కుమార్ సాయిని నాగ్ అప్రిషియేట్ చేశారు. బెలూన్లతో కబడ్డి.. ఏం టీమ్ బెలూన్లు పూర్తిగా పగిలిపోతే వాళ్లు ఓడిపోయినట్టు. అవినాష్ కామెంటేటర్‌గా కబడ్డి స్టార్ట్ అయింది. దీనిలో మెహబూబ్ టీం గెలిచింది. అనంతరం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురి ముందు ఆరు బోర్డులు పెట్టి ఎవరెవరు ఏ ఏ బోర్డులో ఎంచుకోవాలో డిసైడ్ చేసుకోవాలని నాగ్ సూచించారు. అయితే 4, 5, 6 బోర్డులకు సంబంధించి సొహైల్, హారిక, కుమార్ సాయిల మధ్య క్లాష్ వచ్చింది. అయితే నాగ్.. ఎవరెక్కడ నిల్చోవాలనే దాన్ని నామినేషన్స్‌లో లేని కంటెస్టెంట్ల చేతిలో పెట్టారు. దీంతో 1లో అభి, 2లో మెహబూబ్, 3లో లాస్య, 4లో సొహైల్, 5లో కుమార్ సాయి, 6లో హారిక నిల్చొన్నారు. ఆడియెన్స్ నిన్న స్వాతిని ఎలిమినేట్ చేశారని.. మిమ్మల్నందరినీ సేఫ్ చేశారని నాగ్ సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments