బిగ్ బాస్ 4: అభికి దూరమవుతున్న మోనాల్.. దగ్గరవుతున్న హారిక
Send us your feedback to audioarticles@vaarta.com
మైండ్ బ్లాక్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. రోబోల చార్జింగ్ అయిపోవడంతో చిన్నగా అవినాష్ వచ్చి అమ్మ రాజశేఖర్ పక్కన కూర్చొని స్మార్ట్‌గా చార్జింగ్ పెట్టుకున్నాడు. మాటల్లో పెట్టేసి చార్జింగ్ పెట్టిన విషయాన్ని మనుషులకు కనపడకుండా కవర్ చేశాడు. దీంతో అవినాష్‌కి చార్జింగ్ వచ్చేసింది. దీంతో మనుషులకు, రోబోలకు మధ్య క్లాష్ స్టార్ట్ అయింది. అమ్మ రాజశేఖర్‌ని అవినాష్ ఆట పట్టిస్తుండగా.. ఇక నేను ఎవ్వరినీ నమ్మబోనని అమ్మ రాజశేఖర్ తెలిపారు. వీరిద్దరి మధ్య ఫన్ బాగా జెనరేట్ అయ్యింది.
తరువాత టాస్క్ ముగిసినట్టు బిగ్‌బాస్ ప్రకటించారు. అయితే రోబోలు గెలిచినట్టు పేర్కొన్నారు. అయితే మనుషుల టీం కూడా బాగా పెర్ఫార్మ్ చేసిందని బిగ్‌బాస్ అభినందించారు. తొలిసారి అభి ఉన్నచోట తాను ఉండలేనని.. తను రేషన్ మేనేజర్‌గా ఉన్నాడు కాబట్టి తాను కిచెన్‌లో చేయనని నోయెల్‌కి చెప్పింది. మోనాల్‌కి నోయెల్ సర్ది చెప్పాడు. ఒక ముద్దువ్వు లేదంటే తర్వాత ఫీలవుతావు అని గంగవ్వను అవినాష్ ఆట పట్టించాడు. ఇవాళ మొత్తమ్మీద అవినాష్, అమ్మ రాజేశేఖర్ల మధ్య సంభాషణలు చాలా నవ్వు తెప్పించాయి. కెప్టెన్ పోటీలో అభిజిత్, గంగవ్వ, హారిక, అవినాష్ ఉన్నారు. వరస్ట్ పెర్ఫార్మర్గా నోయెల్ ఎంపికయ్యాడు. దీంతో బిగ్‌బాస్ నోయెల్‌ను జైలుకి పంపించారు.
జైల్లో ఉన్న సభ్యునికి ఎటువంటి ఆహారం ఇవ్వడానికి వీల్లేదని బిగ్‌బాస్ సూచించారు. కనీసం టీ, కాఫీలు కూడా ఇవ్వొద్దని తెలిపారు. ఆ తరువాత దివి ఫీల్ అయితే అమ్మ రాజశేఖర్ సర్ది చెప్పారు. ఆ తరువాత జైలులో నోయెల్ ర్యాప్‌తో అలరించగా.. దివి కూడా మంచి పాటతో సందడి చేసింది. మొత్తమ్మీద ఇవాళ్టి షోని బట్టి చూస్తే అభికి క్రమక్రమంగా మోనాల్ దూరమవుతుండగా.. దేత్తడి హారిక దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది. అయితే గేమ్‌ను అర్ధాంతరంగా ముగించినట్టు అనిపించింది. ఇప్పటి వరకూ బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో ఇదే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాంటి షోకి ఇలా అర్థాంతరంగా ఫుల్ స్టాప్ పెట్టడం అంత మంచిగా అనిపించలేదు. ఇక రేపు ఓ హీరోయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రోమోను బట్టి తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com