ఇవాళ్టి బీభత్సాన్ని చెప్పలేం.. చూసి తీరాల్సిందే..
Send us your feedback to audioarticles@vaarta.com
రోబోల కిడ్నాప్ స్కెచ్‌తో షో స్టార్ట్ అయింది. అభి స్కెచ్ పర్ఫెక్ట్‌గా గీశాడు. ముందే రిహార్సల్ కూడా వేయించాడు. నిజానికి దేవి చనిపోయింది. ఆటలో ఇన్వాల్వ్ అవకూడదు. కానీ దేవి కూడా ఆటలో ఇన్వాల్వ్ అవడం.. బిగ్‌బాస్ కూడా దీనికి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. స్కెచ్‌లో భాగంగా గంగవ్వ వచ్చి మనుషులను టెమ్ట్ చేయడానికి యత్నించినా అఖిల్ వచ్చి ఆమె యత్నాన్ని భగ్నం చేశాడు. గంగవ్వ మాత్రం గివ్ అప్ ఇవ్వలేదు. తీవ్ర ప్రయత్నం చేసింది. సుజాతను తీసుకు రావాలని అభి ప్లాన్. ఆమె ఒక్కతే వీక్ అనేది అభి అభిప్రాయం. ఆటను అఖిల్ ఎంత సీరియస్‌గా తీసుకుంటాడో.. గత వారం బోటు టాస్క్‌లో చెప్పగా.. ఇవాళ ఈ టాస్క్‌లో కూడా చెప్పాడు.
ముందు నుంచి రోబోల స్కెచ్‌ను కాస్తో కూస్తో అఖిల్ అంచనా వేస్తూనే ఉన్నాడు. కానీ మిగిలిన వాళ్లు మాత్రం లైట్ తీసుకున్నారు. ఫైనల్‌గా అభి స్కెచ్‌లో దివి అడ్డంగా ఇరుక్కుపోయింది. స్కెచ్ ప్రకారం దివిని గట్టిగా పట్టుకున్నారు. బయట మనుషులు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. దేవి గేమ్‌లో లేదని.. అఖిల్ మొత్తుకుంటూనే ఉన్నాడు. అయితే లోపలికి వెళ్లిన దివి మాత్రం కూల్‌గా ఉండగా.. బయటనున్న మనుషులు మాత్రం అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సొహైల్.. కుమార్ మీద రెచ్చిపోవడం మాత్రం కాస్త ఓవర్ అనిపించింది. ఈ నేపథ్యంలో ఓ రేంజ్‌లో రచ్చ నడిచింది. ఇప్పటి వరకూ జరిగింది ఒక లెక్క.. ఇవాళ జరిగింది ఒక లెక్క. చూసి తీరాల్సిందే అనిపించింది. ఆ తరువాత మనుషులను ఇంట్లోకి రానిచ్చారు. దీంతో మనుషులకు, రోబోలకు మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం నడిచింది.
ఈ సందర్భంగా సొహైల్‌కు అరియానాకు మధ్య ఉన్న చిన్నపాటి గొడవ కాస్తా తీవ్ర రూపం దాల్చింది. తాము మోసపోయాం.. విజయాన్ని చేజార్చుకున్నామన్న అసహనం, నిస్సహాయత కోపం రూపంలో మనుషుల నుంచి బయటకు వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే అన్ని సీజన్స్‌లోనే నేటి షో హైలైట్‌గా అనిపించింది. మనుషులు లోపలకు వచ్చినప్పుడు మనం చార్జింగ్ పెట్టుకోవాలి కదా.. అని అరియానా పాయింట్ రేజ్ చేసింది. ఈ సందర్భంగా అరియానాకు, హారికకు మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది. చిన్నగా బయటకు వెళ్లి నిద్ర పోతున్న వారి నుంచి చార్జింగ్ పొందాలని.. మరో స్కెచ్ గీశారు. దానిని అమలు చేయడం కోసం అవినాష్, అరియానా ఫిక్స్ అయిపోయి బయటకు వచ్చారు. కానీ అరియానా అడ్డంగా దొరికిపోయింది. మొత్తమ్మీద ఇవాళ్టి బీభత్సాన్ని మాటల్లో చెప్పలేం.. చూసి తీరాల్సిందే.. మొత్తంగా షో చూస్తుంటే ఈ వారం కూడా హోస్ట్ నాగార్జునకు చేతినిండా పని ఉండేలా కనిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com