ఆట మొదలైంది...
Send us your feedback to audioarticles@vaarta.com
ఓపెనింగే అఖిల్‌తో మోనాల్ మీటింగ్. మోనాల్ కూర్చొని ఉంటే అవాయిడ్ చేశాడట. వచ్చి అడిగింది. నిన్న కన్ఫెషన్ రూమ్‌లో నాగ్ చూపించిన వీడియోల తాలుకు ఎఫెక్ట్ అఖిల్‌పై బాగా ఉందని తెలుస్తోంది. ఇక ‘డార్లింగే’ సాంగ్‌తో డే స్టార్ట్ అయింది. మెహబూబ్, సొహైల్ నిద్ర పోతుంటే కుక్కలు మొరిగాయి. అయితే సొహైల్ మాత్రం నీ వల్లే కుక్కలు మొరిగాయని మెహబూబ్‌కి చెప్పాడు. మెహబూబ్‌కి కెప్టెన్ అరియానా పనిష్మెంట్ ఇచ్చింది. ఈరోజు వైలెన్స్ అవుతుందనిపిస్తోందని అభి.. లాస్యకు చెప్పాడు. ఈసారి మాత్రం సొహైల్ దొరికిపోయాడు. అయితే తనకు జలుబు చేసిందని.. ఇప్పుడే స్నానం చేశానని కొద్దిసేపటి తర్వాత చేస్తానని చెప్పినా అరియానా వినిపించుకోలేదు. దీంతో సొహైల్‌కు బీభత్సమైన కోపం వచ్చింది. పరిగెత్తుకు వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో దూకాడు. మెహబూబ్ వెళ్లి నీకు ఆరోగ్యం బాగోలేదు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రమ్మన్నా నేను రానని భీష్మించాడు. తరువాత బయటకు వచ్చిన సొహైల్ నేను ఇలాగే ఉంటా.. తుడుచుకోనని చెప్పాడు. అవినాష్ చెప్పినా వినిపించుకోలేదు.
అఖిల్ వచ్చి నచ్చజెప్పబోయినా వినిపించుకోలేదు. దీంతో అందరినీ వదిలేయమని చెప్పాడు. ఇవాళ మళ్లీ పాత సొహైల్ బయటకు వచ్చాడు. మళ్లీ అఖిల్.. సొహైల్ సర్ది చెప్పబోయాడు. నువ్వెందుకు ఆరోగ్యం ఖరాబు చేసుకుంటున్నావని చెప్పాడు. బట్టలు మార్చుకునే క్రమంలో సొహైల్ మైక్ పక్కనబెట్టాడు. దీంతో బిగ్‌బాస్ మైక్ ధరించమని సొహైల్‌కు చెప్పాడు. మళ్లీ అరియానా వచ్చి పనిష్మెంట్ని అమలు చేయాలని తెలిపింది. కానీ నేను చేయనంటే చేయనని సొహైల్ చెప్పాడు. మళ్లీ షూ లేస్ గురించి సొహైల్ గొడవ స్టార్ట్ చేశాడు. అరియానా వాటిని తీసుకుని ఇవ్వలేదని నా రూల్ ప్రకారం పనిష్మెంట్ ఇస్తానని కూర్చొన్నాడు. బిగ్‌బాస్ ఇంట్లో ప్రయాణం సగం పూర్తయిందని ఇక మీదట అసలైన ఆటను చూపే సమయం ఆసన్నమైందని బిగ్‌బాస్ చెప్పారు. నామినేషన్ ప్రక్రియను వివరించారు. ఒక్కొక్కరు ఇద్దరిని చొప్పున గుడ్డు కొట్టి నామినేట్ చేయాలి. కెప్టెన్ అయినందున అరియానాను నామినేట్ చేయడానికి వీల్లేదు. నేను ఎగ్ కొట్టలేనని మోనాల్ కెమెరాకు చెప్పింది. ఆమె వెజిటేరియన్ కాబట్టి ఆ పని చేయలేనని చెప్పడంతో ఆమె నామినేట్ చేయాలనుకున్న సభ్యుల తలపై వేరొకరి చేత పగలగొట్టించ వచ్చని బిగ్‌బాస్ చెప్పారు. నామినేషన్ ప్రక్రియను అరియానా స్టార్ట్ చేసింది. మొదట హారికను నామినేట్ చేసింది. తరువాత సొహైల్‌ను నామినేట్ చేసింది. పనిష్మెంట్ విషయమే చెప్పి సొహైల్‌ని నామినేట్ చేసింది. తన ఆరోగ్యం బాగోలేదని చెప్పాడు. ఇద్దరి మధ్య చిన్న వాగ్యుద్ధం నడిచింది. తరువాత కూడా సొహైల్‌కి కోపం తగ్గలేదు. అఖిల్ దగ్గరికెళ్లి కూర్చొని అరియానా చెప్పిన రీజన్ కరెక్టుగా లేదని చెప్పాడు. అఖిల్ మాత్రం సైలెంట్‌గా వింటూ కూర్చొన్నాడు.
నెక్ట్స్ అవినాష్.. అభిని నామినేట్ చేశాడు. నోయెల్‌తో జరిగిన గొడవలో అభి ఇన్వాల్వ్ అయినందుకు నామినేట్ చేస్తున్నట్టు అవినాష్ చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది. అభి ప్రశాంతంగా మాట్లాడుతున్నా.. అవినాష్ మాత్రం వినిపించుకోకుండా ఫైర్ అయ్యాడు. తరువాత హారికను నామినేట్ చేశాడు. నెక్ట్స్ సొహైల్.. మోనాల్‌ను నామినేట్ చేశాడు. అఖిల్ తనపై కోప్పడటానికి మోనాలే కారణమని కాబట్టి నామినేట్ చేశాడు. తరువాత అభిని నామినేట్ చేశాడు. వీరిద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతుంటే.. మోనాల్ వాష్ రూమ్‌కి వెళ్లి ఏడుస్తుంటే.. అమ్మ వెళ్లి ఓదార్చాడు. ఇక అభి నీకూ నాకూ మధ్య జోక్స్ వద్దనిచెప్పాడు. తరువాత అభి.. అవినాష్‌ని నామినేట్ చేశాడు. క్లవర్‌గా కామెడీ చేస్తున్నావని అభి చెప్పాడు. మీరు కామెడీ చేయడానికి వచ్చారు.. కానీ నేను కామెడీ తీసుకోవడానికి రాలేదని అభి స్పష్టంగా చెప్పాడు. అవినాష్ రెచ్చిపోయాడు. నేను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానంటూ గొడవ గొడవ చేశాడు. మీరు మాట్లాడే ప్రతి ఒక్కరికీ ప్రేక్షకులకే చెబుతారు అది బాగా తెలుస్తోందని అభి చెప్పాడు. రేపటి ప్రోమోను చూస్తుంటే అభికి అమ్మకి మధ్య పెద్ద గొడవే జరిగినట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com