పట్టు వదలని విక్రమార్కుల్లా అఖిల్, సొహైల్...

  • IndiaGlitz, [Friday,December 04 2020]

‘పట్టి పట్టి నన్నే సూస్తంటే..’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. రేస్ టు ఫినాలే టాస్క్ ఫైనల్ రౌండ్‌ మొదలైంది. అభి.. సంచాలకుడు. ఫస్ట్ బజర్ మోగగానే రెడీ అవ్వాలి. సెకండ్ బజర్‌ మోగగానే లాన్‌లో ఏర్పాటు చేసిన ఊయలలో కూర్చోవాలి. ఊగుతూనే ఉండాలి. చాలా జోష్‌తో అఖిల్, సొహైల్ టాస్క్‌ను ప్రారంభించారు. హారిక.. సొహైల్‌ను ఆట పట్టించడం చాలా ఫన్నీగా అనిపించింది. తరువాత స్వెటర్స్‌ను బిగ్‌బాస్ పంపించారు. అవి వేసుకుని వాటిపై మనాలీ జాకెట్లు వేసుకోవాలి. అవినాష్.. అఖిల్, సొహైల్‌లను 48 గంటల పాటు ఊయల నుంచి దింపవద్దని బిగ్‌బాస్‌కి రిక్వెస్ట్ పెట్టాడు. అవినాష్ హౌస్‌లోకి వెళ్లి మోనాల్‌ను తీసుకుని వచ్చాడు. మోనాల్‌ని అఖిల్ మీ తమ్ముడా? అని అడగడం చాలా ఫన్నీగా అనిపించింది. కాదు అవినాష్ మా అన్న అని చెప్పడం మరింత ఫన్నీగా అనిపించింది. ఏం పాపం చేశా.. ఆ అమ్మాయితో అన్న అని పిలిపించారని అవినాష్ ఫీలవడం.. ఆ తరువాత మోనాల్ నాతో మాట్లాడవద్దని చెప్పడం.. బయటకు వచ్చి అన్న కాదని చెప్పమని బతిమాలడం చాలా నవ్వు తెప్పించింది. మళ్లీ వచ్చి మోనాల్.. అవినాష్ అన్న అని చెప్పడంతో అవినాష్ ఎక్స్‌ప్రెషన్స్ బాగా ఫన్నీగా అనిపించాయి. తరువాత బిగ్‌బాస్.. అఖిల్, సొహైల్ కోసం పాలు పంపించారు. బాదం పాలలో మిరియాలు వేసి.. షుగర్ వేయకుండా పంపించారు. సొహైల్ అయితే ఎంజాయ్ చేశాడు. అఖిల్ మాత్రం నిజానికి పాలే తాగడట. ఇప్పుడు తాగాల్సి రావడంతో చాలా ఇబ్బంది పడుతూ ఎలాగో తాగేశాడు.

మంచి, చెడు మెమోరీస్ ఏవీ గుర్తు లేవని హారికతో మోనాల్ చెప్పింది. ఇక ఎంతకీ దిగకపోవడంతో బిగ్‌బాస్ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అయినా సొహైల్ కాస్త భయపడ్డాడు కానీ ఊయల నుంచైతే దిగలేదు. నెక్ట్స్ బిగ్‌బాస్ రాడిష్ జ్యూస్ పంపించారు. దానిని ఇద్దరూ ఒకరికొకరు తాగించుకోవాలి. ఇది తాగిస్తూ తాను ఊయలపై ఉండటానికి ఎందుకు అర్హుడు? ఎదుటి వ్యక్తి ఎందుకు కాదని చెప్పాలని బిగ్‌బాస్ కండిషన్ పెట్టారు. నేను ఆలోచించి డెసిషన్ తీసుకుంటానని.. నువ్వు తొందరపాటు డెషిసన్స్ తీసుకుంటావని అఖిల్ చెప్పాడు. నేను కెప్టెన్ అయినప్పుడు నువ్వు దిగావు.. నేను దిగలేదని చెప్పాడు. ఇద్దరూ వాదోపవాదాలు.. ఒక రేంజ్‌కి వెళ్లి చప్పున చల్లారింది. ఆ తర్వాత రీజన్స్ ఫన్నీగా మారిపోయాయి. మధ్యలో అరియానా కల్పించుకోవడంతో ఇద్దరూ కలిసి ఆమె మీద వాదనకు దిగడం చాలా ఫన్నీగా అనిపించింది. మోనాల్ గురించి అభి, హారిక మధ్య చర్చ జరిగింది. నువ్వు నాకు ఇష్టమని మోనాల్ చెప్పిందని అభి.. హారికకు చెప్పాడు. ఇదొక పర్సనల్ స్టేట్‌మెంట్ అని కానీ తానెప్పుడూ దానిని బయటపెట్టలేదని అభి చెప్పాడు. ఈ సందర్భంగా అభి ఇంగ్లీషులో మాట్లాడుతుంటే హారిక వారించింది. దీంతో అభి ఫైర్ అయ్యాడు. నేను అంత తప్పు చేస్తే బిగ్‌బాస్ అనౌన్స్ చేస్తారుగా.. నీకెందుకు అంత బాధ అని కోపంతో అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు.

సొహైల్ గురించి అరియానా, హారిక కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఇంట్లో టాస్క్ జరుగుతున్నందున టాస్క్ ముగిసే వరకూ లైట్స్ ఆఫ్ చేయబడవని బిగ్‌బాస్ చెప్పారు. అది విని అంతా సరదాగా నవ్వుకున్నారు. అవినాష్‌ని సొహైల్, అఖిల్ కలిసి ఆట పట్టించారు. అవినాష్.. కెమెరా దగ్గరికెళ్లి రేస్ టు ఫినాలే.. వాళ్లు ఆడితే నైట్ అంతా మేము పడుకోకుండా ఉండమేంటి.. బిగ్‌బాస్ చలి పెడుతోందంటూ వాపోయాడు. ఇక సొహైల్ నాతో పాటు అరియానా కూడా జాగారం చేయడం హ్యాపీగా అనిపిస్తోందని సొహైల్ చెప్పాడు. నాకు ఛాన్స్ వస్తే సొహైల్, అరియానా ఇద్దరినీ చంపేస్తానని అవినాష్.. నాకు ఛాన్స్ వస్తే నిన్ను చంపేస్తానని అఖిల్.. మొత్తానికి ఫన్నీ ఫన్నీగా గడిచింది. చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. అన్నేసి గంటలు కూర్చోవాలంటే చాలా కష్టం. అయినప్పటికీ ఇద్దరిలో ఎవరూ కూడా గివ్ అప్ ఇవ్వకుండా పట్టువదలని విక్రమార్కుల్లా ఊయలలోనే కూర్చుండిపోయారు. ఈ టాస్క్ రేపు ముగియబోతోందని ప్రోమోని బట్టి తెలుస్తోంది.