అక్క ఇచ్చిన బూస్ట్‌ని బాగా వంట పట్టించుకున్న మోనాల్..

  • IndiaGlitz, [Saturday,November 21 2020]

ఓపెనింగే.. జున్ను ఎంట్రీ.. కొడుకును చూసి లాస్య ఆనందంతో పొంగిపోయింది. లాస్య భర్త మంజునాథ్ ఆమెకు చాలా ధైర్యం చెప్పారు. నువ్వు చాలా స్ట్రాంగ్ ఏడవొద్దని చెప్పారు. గివ్ అప్ ఇవ్వకు అని చెప్పారు. టాస్క్‌లపై కాన్సన్‌ట్రేట్ చేయాలని చెప్పారు. కంటెస్టెంట్‌లంతా జున్నును చూసి చాలా సంతోషించారు. తన ఆట తీరు ఎలా ఉందో లాస్య భర్తను అడిగి తెలుసుకుంది. నీ నవ్వు జెన్యూన్ అని చెప్పారు. ఇక హోస్ట్ నాగార్జున ఎలా సేఫ్ చేస్తారో అఖిల్ పేర్లు చెబుతుంటే సొహైల్, అవినాష్, అరియానాలు చేసి చూపించారు. తరువాత కమాండో టాస్క్ ముగిసిందని బిగ్‌బాస్ చెప్పారు. ఇక నెక్ట్స్ డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా..’ సాంగ్‌తో డే స్టార్ట్ అయింది. అవినాష్, సొహైల్‌లతో హారిక ఫన్నీగా ఆడుకున్న తీరు చాలా సరదాగా అనిపించింది. ఇక అవినాష్.. అరియానా, హారికను స్కూలు కెళ్లకుండా ఇంట్లో కూర్చొన్నారంటూ ఫన్నీగా గొడవ స్టార్ట్ చేశాడు. అరియానా అందం గురించి మాట్లాడితే మనకు లేని దాని గురించి మాట్లాడొద్దంటూ సరదాగా గొడవకు దిగాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్. హయ్యర్ రిఫ్రిజిరేటర్‌కు సంబంధించిన టాస్క్. అవినాష్ క్వశ్చన్స్ అడిగితే కంటెస్టెంట్లు ఆన్సర్ చెయ్యాలి. ఆన్సర్ చేసినప్పుడు ఫ్రిజ్ డోర్ తీసి లగ్జెరీ బడ్జెట్ ఐటెమ్స్‌ను తీసుకోవాలి. ఫస్ట్ సొహైల్, లాస్య, అభి, మోనాల్‌లు ఆన్సర్ చేసి లగ్జరీ బడ్జెట్ ఐటెమ్స్ సంపాదించారు.

తరువాత కెప్టెన్సీ టాస్క్. ఈ టాస్క్ కోసం ఎంపికైన అభ్యర్థులు హారిక, అభి, అఖిల్‌లు.. ఒక్కొక్కరి చొప్పున ఒప్పించి వారి భుజంపై ఎక్కి కూర్చోవాలి. ఎవరు ఎక్కువ సేపు కూర్చోబెట్టుకోగలిగితే వారు టాస్క్ విన్ అయినట్టు. అవినాష్.. అభిని.. సొహైల్.. అఖిల్‌ని.. మోనాల్.. హారికను ఎత్తుకుని ఎల్లో బాక్సులో నిలబడ్డారు. అవినాష్ బాధను చూడలేక అభి దిగి పోయాడు. తరువాత సొహైల్ బాధను చూడలేక అఖిల్ కూడా దిగిపోయాడు. కానీ మోనాల్ మాత్రం హారికను కిందకు దింపలేదు. దీంతో హారిక కెప్టెన్‌గా విన్ అయ్యింది. తను అఖిల్‌ని ఎందుకు ఎత్తుకోలేకపోయాడో సొహైల్ చెప్పడంతో హగ్ చేసుకుని ఫ్రెండ్‌కి అఖిల్ థాంక్స్ చెప్పాడు. అఖిల్ చాలా ఫ్రస్టేషన్‌లో ఉన్నట్టు తెలిసింది కానీ ఆ ఫ్రస్టేషన్ ఎందుకో మాత్రం అర్థం కాలేదు. మోనాల్ వచ్చి పక్కన కూర్చొంటే ఒక 5 నిమిషాలు వదిలేయమని అడిగాడు. అంతా గేమ్స్ ఆడుతున్నారని మోనాల్.. అంతా సపోర్ట్ చేస్తామన్నారు.. ఎక్కడుంది సపోర్ట్? అని అఖిల్.. ఫీలయ్యాడు. తనను నమ్మలేదంటూ మోనాల్ ఫీల్ అయింది. మొత్తానికి మోనాల్ నిన్న తన అక్క ఇచ్చిన బూస్ట్‌ని బాగా వంట పట్టించుకుంది.

ఇంటి సభ్యులు బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చాక కొత్తగా నేర్చుకున్న విషయాలేంటనేది చెప్పాలి. సొహైల్.. ఫుడ్ వాల్యూ తెలుసుకున్నానని.. కోపం తగ్గిందని.. ఫోన్ లేకపోతే మనుషుల వ్యాల్యూ తెలుస్తుందని చెప్పాడు. మనషులతో రియల్ ఎమోషన్‌ అనేది ఏర్పడిందని చెప్పాడు. తరువాత అరియానా.. టైమ్ వ్యాల్యూ నేర్చుకున్నానని చెప్పింది. ఇక హారిక.. అభి, లాస్య, మోనాల్‌ల మధ్య ఫన్నీ కాన్వర్సేషన్. ఎంత పని చేస్తివి మోనాల్ అని అభి.. వీళ్లిద్దరూ చూడలేకపోతున్నారని హారిక. ఫన్నీ ఫన్నీగా గడిచింది. హారిక మైక్ మర్చిపోయింది. దీంతో బిగ్‌బాస్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. దీంతో హారికను హౌస్‌మేట్స్ ఆట పట్టించారు. మొత్తానికి రెండు రోజులుగా పేరెంట్స్ రావడంతో హౌస్‌లో బాగా పాజిటివిటీ పెరిగిపోయింది. ఈ పాజిటివిటీతోనే ఇవాళ కూడా షో నడిచింది.