BiggBoss: నామినేషన్స్‌లో 10 మంది... ఇనయాను ఆడుకున్న ఆదిరెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగులో ఆదివారం ఎలాంటి ఎలిమినేషన్ లేకపోవడంతో జనాలు కాస్త డీలా పడ్డారు. కానీ సోమవారం వుంది కాదా అని వదిలేశారు. మరి మన్‌డే ప్రేక్షకులకు ఎలాంటి వినోదం అందిందో లేదో ఒకసారి చూస్తే. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా తాము నామినేట్ చేయాలనుకుంటున్న కంటెస్టెట్ ఎదుట వున్న దిష్టిబొమ్మలపై కుండలు పగులగొట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు.
ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే:
గీతూ.. రోహిత్, మెరీనా
రేవంత్... ఇనయా, కీర్తి
ఆదిరెడ్డి.. ఇనయా, రేవంత్
కీర్తి... గీతూ, రేవంత్
శ్రీహాన్.. ఇనయా , కీర్తి
మెరీనా.. గీతూ, శ్రీసత్య
బాలాదిత్య.. శ్రీసత్య, ఫైమా
రోహిత్... శ్రీసత్య, గీతూ
వాసంతి.. రేవంత్, గీతూ
రాజ్.. గీతూ, బాలాదిత్య
ఫైమా... బాలాదిత్య, ఇనయా
శ్రీసత్య... బాలాదిత్య, ఇనయా
మొత్తం మీద ఈ వారం రేవంత్, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, కీర్తి, శ్రీసత్య, ఇనయా, రోహిత్, మెరీనా,ఫైమా ఇలా మొత్తం పది మంది నానినేషన్స్‌లో వుండగా.. కెప్టెన్ శ్రీహాన్, రాజ్, వాసంతిలను ఒక్కరూ నామినేట్ చేయకపోవడం విశేషం.
ఇక ఈ రోజు కొందరు కంటెస్టెంట్స్ చేసిన ఓవరాక్షన్ చిరాకుతో పాటు నవ్వు తెప్పించింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందిగా ఆదిరెడ్డి గురించే. ఈ రివ్యూ స్టార్... ఇనయాను నామినేట్ చేస్తూ ‘‘ఫేకో ఫేకహా ఫేకోబ్యహ’’ అంటూ కామెంట్ చేశాడు. సూర్యని నామినేట్ చేసింది నువ్వే.. ఎలిమినేషన్‌కి కారణమూ నువ్వే అంటూ ఆమెకు గట్టిగా ఇచ్చాడు. నీ దెబ్బకి సూర్య ఔట్ అని కామెంట్ చేశాడు. సూర్యకు సపోర్ట్ చేసి అతన్ని , రేవంత్‌కి సపోర్ట్ చేసి అతన్ని, శ్రీహాన్‌తో ఫ్రెండ్ షిప్ చేసి అతన్ని పొడిచావ్ అంటూ మండిపడ్డారు. దీనికి.. ఫేక్ ఆడుతున్నారని అనిపించింది.. అందుకే నామినేట్ చేస్తున్నానని ఇనయా చెప్పడంతో ఆదిరెడ్డి సెటైర్లు వేశారు. ఆమె కుండబద్ధలు కొట్టేందుకు వెళ్తుండగా ఆగమ్మా... కొట్టబాకు తల్లీ అంటూ కుండని తీసి దాచేసుకున్నాడు. చెమికీలకి, గోధుమ పిండికి, మరమరాలకి, అన్నింటికీ నామినేట్ చేయడమేనా ఆదిరెడ్డి ప్రశ్నించగా... గోధుమ పిండికి మరమరాలకి ఎప్పుడు నామినేట్ చేశానని అడగ్గా.... నువ్వు త్వరలో చేస్తావని ఆదిరెడ్డి వ్యాఖ్యానించాడు. నేనే బిగ్‌బాస్ 6 సీజన్ విన్నర్‌ని అని ఇనయా చాలా ధీమాగా చెప్పింది. దీనికి చంకలు గుద్దుకోవద్దంటూ కామెంట్ చేశాడు ఆదిరెడ్డి.
అంతకుముందు రేవంత్ కూడా ఇనయానే టార్గెట్ చేశాడు. సూర్య నామినేషన్‌లోకి రాలేదని, చాలా సేఫ్‌గా ఆడుతున్నాడని, గుద్దితే వెళ్లిపోతాడని నువ్వు చాలా సార్లు అన్నావని రేవంత్ అన్నాడు. నేనలా అనలేదు.. సూర్య గురించి ఇప్పుడు చెప్పాల్సిన పనేముందని ఇనయా ప్రశ్నించింది. అటు ఫైమాకి నాగార్జున వార్నింగ్ ఇచ్చినా ఏమాత్రం వెటకారం తగ్గలేదు. అంతటితో ఆగకుండా వెటకారం ఎక్కువైతే కట్ చేసుకోవాలంటూ బిగ్‌బాస్‌కే సలహా ఇచ్చింది. ఇక హౌస్‌లో ఇంతటి గొడవ జరుగుతుంటే శ్రీసత్య, శ్రీహాన్‌ల వెకిలి చేష్టలు చిరాకు తెప్పించాయి. బిగ్‌బాస్ విన్నర్‌ని నేనే అని ఇనయా అంటూ.. మన గీతక్క పకపకా నవ్వేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com