సునీల్ పాత్రలో బిగ్ ట్విస్ట్.. అంచనాలు పెంచేస్తున్న 'పుష్ప'
Send us your feedback to audioarticles@vaarta.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేనివిధంగా డిఫెరెంట్ గెటప్ లో మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ టీజర్ లో బన్నీ గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో రా లుక్ లో ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఇదీ చదవండి: రెమ్యునరేషన్ వివాదం.. స్టార్ హీరోయిన్ కి పూజా హెగ్డే సపోర్ట్
ఇక ఇటీవల పుష్ప చిత్రం నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో విలన్ రోల్ పై మతి పోగొట్టే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి విలన్ రోల్ లో ట్విస్ట్ ఏంటి అని అనుకుంటున్నారా ?
నటుడు సునీల్ కమెడియన్ గా, హీరోగా అందరిని అలరించాడు. ఇటీవల నెగిటివ్ షేడ్స్ లో కూడా మెప్పిస్తున్నాడు. డిస్కో రాజా చిత్రంలో సునీల్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప చిత్రంలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడని అందరికి తెలుసు.
కానీ ఇక్కడే సుకుమార్ మార్క్ బయట పడింది. సునీల్ పోషిస్తోంది సాదా సీదా పాత్ర కాదు. పుష్ప మొదటి భాగంలో సునీల్ ప్రధాన విలన్ అట. మొదటి భాగం క్లైమాక్స్ నుంచి ఫహద్ ఫాసిల్ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. అప్పటి వరకు సునీల్ విలన్ గా ఉంటాడట. ఇది కథలో బిగ్ ట్విస్ట్ అని అంటున్నారు.
మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments