MP Galla Jayadev:టీడీపీకి భారీ షాక్.. పార్టీ వీడే యోచనలో ఎంపీ గల్లా జయదేవ్..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ టీడీపీ పరిస్థితి దిగజారుతోంది. ఓవైపు రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం సృష్టి్స్తుందని సర్వేలు చెబుతుంటే.. మరోవైపు ఎన్నికల్లో పోటీకి చేయడానికి టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదు. తాజాగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీని వీడనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 23 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చడంతో జయదేవ్ పార్టీని వీడినున్నట్లు సమాచారం. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తున్న తరుణంలో టీడీపీలో ఉండి లాభం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.
గల్లా బాటలో మిగిలిన నాయకులు..
టీడీపీ తరపు పార్లమెంట్‌లో కొద్దో గొప్పో తన వాణిని వినిపించగల గల్లా జయదేవ్ లాంటి వ్యక్తే పార్టీకి రాజీనామా చేయనుండటంతో మిగిలిన నాయకులు కూడా అయోమయంలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీడీపీ ఖాళీ అయ్యేటట్లు ఉంది. దీనికి తోడు భారీగా ఆశలు పెట్టుకున్న పవన్ గ్రాఫ్ కూడా రోజురోజుకు పడిపోతుంది. ఇప్పటివరకు పవన్ సభ పెడితే పైసా ఖర్చులేకుండా జనం వస్తారనేది ఆయనకు ఉన్న క్రేజ్‌గా భావించేవారు. అయితే తెలంగాణా ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోవడంతో పవన్‌ను నమ్ముకున్న క్యాడర్ నెమ్మదిగా జారిపోతున్నారు. తాజాగా విశాఖలో జరిగిన సభకు జనం పల్చగా రావడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.
అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి..
అందుకే టీడీపీ సీనియర్ నేతలు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జయదేవ్ బాటలోనే మరికొంత మంది ఎంపీ స్థాయి నాయకులు ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఎంపీ అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదట. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు చెప్పడంతో ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. దీనికి తోడు జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com