Pothina Mahesh: జనసేన పార్టీకి భారీ షాక్.. కీలక నేత పోతిన మహేష్ రాజీనామా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. విజయవాడలో పార్టీ కీలక నేతగా ఉన్న పోతిన మహేష్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పంపించారు. పార్టీ పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, జన సైనికులకు ధన్యవాదాలు తెలిపారు.
జనసేన ఆవిర్భావం నుంచి పోతిన మహేష్ పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రత్యర్థుల ఆరోపణలను బలంగా తిప్పికొట్టేవారు. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి వైసీపీ నేతల వెల్లంపల్లి శ్రీనివాస్‌పై ఓడిపోయారు. అయినా కానీ పార్టీ కోసం తన వంతు పనిచేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో తిరిగి తనకు టికెట్ దక్కుతుందని ఆశించారు.
కానీ పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటు బీజేపీకి వెళ్లిపోయింది. ఇక్కడి నుంచి కమలం సీనియర్ నేత సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. అయితే తనకే నియోజకవర్గం సీటును కేటాయించాలని డిమాండ్ చేస్తూ కుటుంబసభ్యులు, అభిమానులతో కలిసి ఆందోళనకు సైతం దిగారు. పవన్ కల్యాణ్‌తో భేటీ అయి తనకు సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అయితే పవన్ నుంచి స్పష్టహైన హామీ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. మహేష్ రాజీనామాతో విజయవాడలో జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం విధితమే. ఇప్పటికే పాలకొండ అసెంబ్లీ మినహా 20 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్ర ద్వారా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయనకు తీవ్ర జ్వరం కారణంగా ప్రచారానికి బ్రేకులు పడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout