Palvai Sravanti:కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి..

  • IndiaGlitz, [Saturday,November 11 2023]

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. గతేడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై స్రవంతి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో తిరుగుతూ అసెంబ్లీ టికెట్ కోసం పనిచేశారు. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడంతో మునుగోడు టికెట్‌ను ఆయనకే పార్టీ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన స్రవంతి పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

వాస్తవానికి మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్‌ రెడ్డి పేరు ప్రకటించిన రోజునే ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కానీ ఇంతలోనే ఆమె పార్టీ మారడం సంచలనంగా మారింది. 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డికి టికెట్ రావడంతో పాల్వాయి స్రవంతి ఆయన గెలుపు కోసం పని చేశారు. అయితే గతేడాది కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ నుంచి బరిలో నిలవగా, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో నిలబడ్డారు. పది వేల మెజారిటీతో ప్రభాకర్ గెలుపొందిన సంగతి తెలిసిందే.

అయితే బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వెంటనే మునుగోడు టికెట్ కాంగ్రెస్ కేటాయించింది. దీంతో పాల్వాయి స్రవంతి తీవ్ర నిరాశకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీలోకి వెళ్లి వచ్చిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ఆమె మండిపడ్డారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వారిని ఎలా విస్మరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్‌ టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి కూడా బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ తరపున ఆయన మునుగోడు నుంచి పోటీచేస్తున్నారు.

More News

Niharika:ఫస్ట్ టైం మూవీ ప్రొడక్షన్‌లోకి నిహారిక .. వరుణ్ - లావణ్య సమక్షంలో ఓపెనింగ్ , డీటెయిల్స్ ఇవే

మెగా వారసురాలు నిహారిక కొణిదెల నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై పలు వెబ్ సిరీస్‌లు,

Chandramohan:బిగ్ బ్రేకింగ్: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

సీనియర్ నటులు చంద్ర మోహన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో

Siddaramaiah:కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: సిద్ధరామయ్య

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు కామారెడ్డి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

Chandrababu:చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా చేసిన హైకోర్టు

స్కిల్ డెవల్‌ప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

Raghavendra Rao:దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది.