24 గంటలు గడవక మునుపే చంద్రబాబుకు ఊహించని షాక్..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ అనిపించుకుండే ఒక్క నేతా లేకపోవడం.. ఏపీలోనూ టీడీపీ ఖాళీ అవుతుండటంతో ఉన్న నేతలను అయినా పార్టీని వీడకుండా ఉండేందుకు బాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ అవన్నీ విఫలం అవుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీకి ఒక్కొకరుగా గుడ్ బై చెబుతూ వస్తున్న విషయం విదితమే.

వైసీపీలోకేనా..!?
ఈ షాక్‌ నుంచి కోలుకోకమునుపే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలాఖా.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన కీలక నేత.. రెండు దశాబ్ధాలుగా వైఎస్ ఫ్యామిలీని ఎదుర్కొంటూ.. విరోధిగా ఉన్న సతీశ్ రెడ్డి సైకిల్ పార్టీకి రాజీనామా చేసేశారు. దీంతో ఒక్క పులివెందులలోనే కాదు.. కడప జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. ఈ మేరకు రాజీనామాకు సంబంధించిన కారణాలు సైతం ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు. 20 ఏళ్లుగా కష్టపడి తాను పార్టీ కోసం పనిచేసినా ఆదరణ లేకపోవడంతోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యకర్తల అభీష్టానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా సతీశ్ ప్రకటించారు. అయితే రాజీనామా చేసిన సతీశ్.. రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు ఉండరన్న విషయాన్ని నిజం చేసి.. తన విరోధి అయిన వైఎస్ ఫ్యామిలీతో కలిసిపోయి.. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారా లేకపోతే.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.

కారణాలివీ..!
‘చంద్రబాబుతో నాకు గ్యాప్ పెరిగింది. పార్టీ కోసం నేను ఎంతో కష్టపడ్డాను. అయినా నాపై చంద్రబాబుకు పూర్తి నమ్మకం లేదు. పులివెందులలో పార్టీని నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడ్డాను. వైఎస్ కుటుంబంతో దశాబ్దాలుగా పోరాడాను. అయినా పార్టీలో నాకు తగిన గౌరవం దక్కలేదు. నన్ను ఆదరించలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో కొనసాగలేను’ అని సతీశ్ రెడ్డి మీడియా ముందు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

24 గంటలు ముగియక మునుపే!
కాగా.. కడప జిల్లాలో కీలకనేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి కొన్ని దశబ్ధాలుగా టీడీపీలో కొనసాగుతూ వస్తున్నారు. అయితే.. ఆయన కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని 24 గంటలుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు వచ్చిన 24 గంటలు ముగియక మునుపే సతీశ్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం.. ఈ వరుస షాక్‌లతో కడప జిల్లాలో టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోనట్లేనని చెప్పుకోవచ్చు.

More News

పవన్‌కు వరుస షాక్‌లు.. వైసీపీలో చేరిన కీలకనేత

‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్‌లో బిజిబిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు షాకింగ్ వార్త విన్నారు. అదేమిటంటే..

ఎన్టీఆర్‌ కొడుకు వదిలితే దూకేసేలా ఉన్నాడుగా..

సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీబిజీగా ఉన్నా ఫ్యామిలీకే ప్రియారిటీ ఇచ్చే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడన్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్.. ఎంపీలో కూలనున్న సర్కార్!

కొన్ని దశాబ్ధాలుగా ఇండియాను ఏలిన కాంగ్రెస్‌కు 2014 తర్వాత అస్సలు కలిసి రావట్లేదు. గత పదేళ్ల నుంచి ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తోంది.

సూప‌ర్‌స్టార్‌ని ఫాలో అవుతున్న మహేశ్..!

ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ఇమేజ్ ఉన్న ర‌జినీకాంత్‌కు ఆధ్యాత్మిక చింత‌న ఎక్కువ‌. ప్ర‌తి ఏడాది ఆయ‌న హిమాల‌యాల‌కు వెళ్లి వ‌స్తుంటారు.

107పై ఫోక‌స్ పెడుతున్న బాల‌కృష్ణ‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.