BRS Party:బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల ప్రచారం నువ్వానేనా అనే రీతిలో సాగుతోంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ సాదరంగా ఆహ్వానించారు. గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా అబ్రహంకే చోటు కల్పించారు. అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్సీ చల్లా వెంట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఉన్న ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
కాగా 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలంపూర్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ప్రసన్న కుమార్‌పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ చేతిలో ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన అబ్రహం 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి జరిగే ఎన్నికల్లోనూ గెలిచి మూడోసారి ఎమ్మెల్యే అవుదామనుకున్న ఆయన ఆశలు నెరవేరలేదు. దీంతో గులాబీ పార్టీకి రాజీనామా చేసి హస్తం చెంతకు చేరారు.
ఇప్పటికే కేసీఆర్ టికెట్ నిరాకరించిన చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిలో సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, రేఖానాయక్, రాథోడ్ బాపూరావు వంటి వారు ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు దెబ్బతినే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com