KCR:గులాబీ బాస్ కేసీఆర్‌కు బిగ్ షాక్.. ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. మే 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేది రాత్రి 8 గంటల వరకు ఎన్నికల ప్రచారం చేయకూడదని నిషేధం విధించింది. గత నెలలో సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదుచేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి వివరణ అడిగింది.
తెలంగాణ మాండలికాన్ని స్థానిక అధికారులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఆయన వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల సంఘం రెండు రోజుల పాటు ప్రచారంపై నిషేధం విధస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
అయితే ఈసీ నిర్ణయంపై కేసీఆర్ స్పందించారు. తన మాటలను ఎన్నికల అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలు తాను మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారని తెలిపారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదని.. కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించాను అని వివరణ ఇచ్చారు
కాగా ప్రస్తుతం బస్సుయాత్ర నిర్వహిస్తున్న కేసీఆర్.. అధికార కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది. ఈసీ ఆదేశాల ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఉండదు. దీంతో పోలింగ్‌కు 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో గులాబీ బాస్ రెండు రోజుల పాటు ప్రచారానికి దూరం కావడం బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com