Janasena: జనసేనకు బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత

  • IndiaGlitz, [Thursday,April 18 2024]

ఎన్నికల వేళ జనసేన పార్టీకి కోనసీమ జిల్లాలో భారీ షాక్ తగిలింది. రాజోలు నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ బొంతు రాజేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు జనసేన సర్పంచ్ కాకర శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు కూడా గుడ్ బై చెప్పారు. అనంతరం తణుకులో‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో రాజోలులో జనసేన పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.

బొంతు రాజేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా పేరు గడించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో రాజోలు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాదరావుపై కేవలం 800 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌‌ వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారు.

దీంతో సీఎం జగన్ రాపాకకు ప్రాధాన్యం ఇవ్వడంతో బొంతు వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉండేవారు. వెంటనే ప్రభుత్వ సలహాదారు పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాజేశ్వరరావు రాజోలు టికెట్ ఆశించారు. కానీ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్‌కు టికెట్ కేటాయించడంతో రాజేశ్వరరావు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో జనసేన పార్టీకి రాజీనామా చేసి తిరిగి వైసీపీ కండువా కప్పుకున్నారు.

కాగా 2019 ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక ఎమ్మెల్యే స్థానం రాజోలు కావడం విశేషం. అయితే గెలిచిన అభ్యర్థి రాపాక వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా జనసేనకు లేకుండా పోయింది. దీంతో ఈసారి సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది. అలాగే వైసీపీ కూడా జనసేన స్థానంలో పాగా వేయాలని డిసైడ్ అయింది. వైసీపీ నుంచి గొల్లపల్లి సూర్యరావు పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఎన్నిక రసవత్తరంగా మారింది.

More News

Teja Sajja :సూపర్ యోధుడి పాత్రలో తేజ సజ్జా.. కొత్త సినిమా గ్లింప్స్ గూస్‌బంప్స్ అంతే..

‘హనుమాన్‌’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు టాలీవుడ్ యువహీరో తేజ సజ్జా. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు.

YCP:సర్వే ఏదైనా సరే.. వైసీపీ గెలుపు ఖాయం.. ఉత్సాహంలో క్యాడర్..

ఏపీలో పోలింగ్‌ సమయం దగ్గర పడ్డే కొద్దీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Election Notification: ఏపీ, తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..

దేశవ్యాప్తంగా నాలుగో విడత స్వారత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విడతలో తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరగనుంది. దీంతో ఏపీలోని అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలకు,

Raghubabu:సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు మృతి

సీనియర్‌ నటుడు గిరిబాబు కుమారుడు, నటుడు రఘుబాబు(Raghubabu) నడుపుతున్న కారు ఎదురుగా వెళ్తున్న బైక్‌ను వేగంగా ఢీకొట్టింది.

Maharshi Raghava:100వ వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులోర‌క్త‌దానం చేసిన న‌టుడు మ‌హ‌ర్షి రాఘ‌వ‌.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా  ప్ర‌త్యేక స‌న్మానం

తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకుకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి ర‌క్త‌నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో  ప్రాణాల‌ను