National Herald: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌కు బిగ్ షాక్..రూ.752కోట్ల ఆస్తులు జప్తు

  • IndiaGlitz, [Wednesday,November 22 2023]

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రూ.752కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ హౌస్, లక్నోలోని నెహ్రూ భవన్, ముంబయిలోని నేషనల్ హెరాల్డ్ హౌస్ ఉన్నాయి. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థకు పలు నగరాల్లో రూ.661.69 కోట్ల ఆస్తులు.. యంగ్ ఇండియన్ సంస్థకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌లో రూ.90.21 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయని ఈడీ వివరించింది.

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ ఆధ్వర్యంలోని 'నేషనల్ హెరాల్డ్' పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచురణ కర్తగా ఉంది. అయితే యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలసిందే. కాగతా ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను కొద్ది నెలల క్రితం ఈడీ విచారించింది.

ఈడీ చర్యలపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఎదురయ్యే ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. రాజకీయ ప్రతీకారం కోసం కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు అవకాశాలను ఆపలేరని చెబుతున్నారు.

More News

Pawan Kalyan: ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ ప్రచారం పక్కా.. షెడ్యూల్ ఖరారు..!

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారు

తెలంగాణ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రచారానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికారులు పోలింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

ఏం సాధించారని 'పచ్చ' నేతల సంబరాలు.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..

ఏదో సాధించినట్లు సంబరాలు.. స్వాత్రంత్య సమరయోధుడు జైలు నుంచి బయటకు వచ్చినట్లు బిల్డప్‌లు.. పచ్చ నేతల హంగామా ఇంతా కాదు.

కబడ్డీ కోసం బరిలో దిగిన బాలయ్య, కిచ్చ సుదీప్, టైగర్ ష్రాప్

నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) అటు సినిమాలు.. ఇటు టాక్‌ షో, యాడ్స్‌లతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే బాలయ్య హోస్ట్ చేస్తు్న్న అన్‌స్టాపబుల్ టాక్ షో సూపర్ హిట్‌ అవ్వగా..

KCR: కేసీఆర్ ప్రసంగాల్లో పస తగ్గిందా..? జనాలను ఆకట్టుకోవడం లేదా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వాగ్ధాటితో ప్రజలను ఆకట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక ఎన్నికల ప్రచారంలో