National Herald: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్కు బిగ్ షాక్..రూ.752కోట్ల ఆస్తులు జప్తు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రూ.752కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ హౌస్, లక్నోలోని నెహ్రూ భవన్, ముంబయిలోని నేషనల్ హెరాల్డ్ హౌస్ ఉన్నాయి. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థకు పలు నగరాల్లో రూ.661.69 కోట్ల ఆస్తులు.. యంగ్ ఇండియన్ సంస్థకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో రూ.90.21 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయని ఈడీ వివరించింది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ ఆధ్వర్యంలోని 'నేషనల్ హెరాల్డ్' పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచురణ కర్తగా ఉంది. అయితే యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలసిందే. కాగతా ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను కొద్ది నెలల క్రితం ఈడీ విచారించింది.
ఈడీ చర్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఎదురయ్యే ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. రాజకీయ ప్రతీకారం కోసం కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు అవకాశాలను ఆపలేరని చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments