Ponnala Lakshmaiah:కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయన్నారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తన లాంటి సీనియర్ నేత అధిష్టానంతో పార్టీ అంశాలు చర్చించాలంటే నెలల తరబడి అపాయింట్మెంట్ కోసం వేచి చూడడం దురదృష్టకర పరిణామమని వెల్లడించారు.
ఢిల్లీలో 10 రోజులు ఉన్నా అపాయింట్మెంట్ ఇవ్వలేదు..
పార్టీ అంశాలు మాట్లాడేందుకు ఢిల్లీకి వచ్చి 10 రోజులు ఉన్నా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలుద్దామని ప్రయత్నిస్తే ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వలేదని ఆరోపించారు. ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే కనీసం ఒక్కసారి కూడా బదులు ఇచ్చిన సందర్భం లేదని వాపోయారు. ఇన్ని అవమానాల మధ్య తాను పార్టీలో ఉండలేనని తెలిపారు. కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తులకు పార్టీ పగ్గాలు ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వివరించారు. జనగామ టికెట్‌ను పొన్నాలకు కాకుండా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్న పొన్నాల..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పొన్నాల లక్ష్మయ్య పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా విధుల నిర్వర్తించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు తొలి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. వరంగల్ జిల్లాలోని జనగాం నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పొన్నాల గెలుపొందారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే జనగామ టికెట్ పల్లా రాజశ్వేర్ రెడ్డికి ఖరారు అయిన నేపథ్యంలో పొన్నాలకు టికెట్ ఇస్తారో లేదో తేలాల్సి ఉంది. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇటీవలే ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తి పరిచారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout