నిర్మాతలకు బిగ్ రిలీఫ్.. రేపటి నుంచి థియేటర్స్ ఓపెన్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో థియేటర్లు కళకళ లాడబోతున్నాయి. జూన్ 20 నుంచి థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నెల నుంచి థియేటర్స్ మూతపడుతూ వచ్చాయి. ఇటీవల చిన్న చిత్రాలకు ఓటీటీలే ఆధారం అయ్యాయి.
ఇదీ చదవండి: నేను 'ఇంద్ర'లో నటించాను.. అది నిజం చేసిన గొప్ప స్నేహితుడు రఘువీరా!
లాక్ డౌన్ కారణంగా అనేక చిత్రాలు రిలీజ్ కు సిద్ధం అయినప్పటికీ విడుదలకు నోచుకోవడం లేదు. ఆ చిత్రాల నిర్మాతలకు తాజా ప్రభుత్వ నిర్ణయం బిగ్ రిలీఫ్ గా మారింది. ఈ ఏడాది చివరగా థియేటర్స్ లో సందడి చేసిన పెద్ద చిత్రం వకీల్ సాబ్.
ఆచార్య, నారప్ప, పుష్ప లాంటి భారీ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే డజన్ల కొద్దీ మీడియం, చిన్న చిత్రాలు కూడా థియేటర్స్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాక్ డౌన్ లో మిగిలిపోయిన షూట్ ని ఫినిష్ చేసేందుకు అన్ని చిత్రాలు సెట్స్ మీదకు వచ్చేస్తున్నాయి. అయితే తెలంగాణలో మాత్రమే లాక్ డౌన్ ఎత్తివేశారు.
ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరి నిర్మాతలు అప్పటి వరకు ఎదురుచూస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉండగా తెలంగాణలో జూలై నుంచి అన్ని రకాల విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments