Pinnelli: పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో మరోసారి భారీ ఊరట..

  • IndiaGlitz, [Tuesday,May 28 2024]

పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి భారీ ఊరట దక్కింది. ఆయనపై నమోదైన మరో మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 6 వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని ఆదేశించింది, అయితే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఉన్న బెయిల్ షరుతులే.. ఈ మూడు కేసుల విషయంలో కూడా వర్తిస్తాయని న్యాయమూర్తి తెలిపారు. తన పైన నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు.

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటులో పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో కేసు నమోదుకాగా.. ఆ కేసులో ఏపీ హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పాల్వాయిగేటు ఘటనలోనే పిన్నెల్లిని అడ్డుకోబోయినందుకు తనపై దాడి, హత్యాయత్నం చేశారని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు రెంటచింతల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పిన్నెల్లితోపాటు మరో 15 మందిపై ఐపీసీ 307(హత్యాయత్నం), మరికొన్ని సెక్షన్ల కింద మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అలాగే ఈవీఎంను ధ్వంసం బయటకొస్తుండగా.. చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ అడ్డుకుని ప్రశ్నించారు. అయితే తనను ఎమ్మెల్యే దూషించారని రెంటచింతల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్‌ 506, 509, ఆర్‌పీ చట్టం సెక్షన్‌ 131 కింద ఇంకో కేసు నమోదైంది.

అంతేకాకుండా ఈ నెల 13న పోలింగ్‌ మరుసటిరోజు కారంపూండిలో పిన్నెల్లి అనుచరులు దాడులకు పాల్పడుతుంటే అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడి చేసి, గాయపరిచారనే మరో ఫిర్యాదు అందింది. సీఐ ఫిర్యాదు చేయడంతో పిన్నెల్లితో పాటుగా ఆయన సోదరుడు, అనుచరులపై 307 తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మూడు కేసుల్లో ఆయనకు బెయిల్ దక్కింది. మరోవైపు ఈవీఎం ధ్వంసం వీడియో బయటకు వచ్చిన దగ్గరి నుంచి పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే.

More News

RS Praveen Kumar: తెలంగాణ గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు పెత్తనం ఏంది బై: ఆర్‌ఎస్పీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని

Rakshana: పాయల్ రాజ్‌పుత్ 'రక్షణ' జూన్ 7న గ్రాండ్ రిలీజ్

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో

Pune Car Incident: పుణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో అదిరిపోయే ట్విస్టులు.. తాజా ట్విస్ట్ ఏంటంటే..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణేలో డ్రంకన్ డ్రైవ్ కారు కేసులో రోజుకో సంచలన పరిణామం చోటుచేసుకుంటుంది. థ్రిల్లర్ మూవీలను మించిన ట్విస్టులు బయటపడుతున్నాయి.

MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రలోభాలు.. స్వతంత్ర అభ్యర్థిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి!

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు.

Amit Shah: ఏపీలో కూటమిదే అధికారం.. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన అమిత్ షా

ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ జూన్ 4వ తేదీ జరగనుండగా.. ఫలితాలపై రాజకీయ విశ్లేషకులు, నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.