కోడలు, మనవళ్ల సజీవ దహనం కేసు.. కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట

  • IndiaGlitz, [Tuesday,March 22 2022]

కోడలి అనుమానాస్పద మృతి కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ( Sircilla Rajaiah) భారీ ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈ కేసులో రాజయ్యతో పాటు ఆయన కుటుంబసభ్యులపై నమోదైన కేసును వరంగల్ జిల్లా కోర్టు (Warangal Dist Court) మంగళవారం కొట్టివేసింది. 2015, నవంబర్ 4న సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక, మనవళ్లు అభినవ్‌, ఆయాన్, శ్రీయాన్ అనుమానాస్పద స్థితిలో సజీవదహనం అయ్యారు. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సిరిసిల్ల రాజయ్య దంపతులతో పాటు సారిక భర్త, ఇతర కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని వరంగల్ జైలుకు తరలించారు.

అయితే వారిది హత్య కాదని.. గ్యాస్ లీక్ అవడం వల్లే ప్రమాదం జరిగిందని హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ నిపుణులు నివేదిక సమర్పించారు. అయితే.. ఘటనా స్థలం నుంచి వస్తువులను సేకరించిన పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఎంజీఎంలో పోస్టుమార్టం సమయంలో కూడా విస్రా టెస్టు కోసం శరీర భాగాల నుంచి నమూనాలను సేకరించారు నిపుణులు. వారు పంపిన శాంపిల్స్‌పై ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌లో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో 20 రోజుల పాటు పరీక్షలు జరిపిన నిపుణులు చివరకు వారు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారించారు.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్... రెండో నిందితుడిగా రాజయ్య.. మూడవ నిందితురాలిగా రాజయ్య భార్య మాధవిపై కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో సిరిసిల్ల రాజయ్య.. కుటుంబమే అసలు దోషులని అంతా భావించారు. కానీ అనూహ్యంగా మంగళవారం వరంగల్ జిల్లా కోర్టు ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేల్చి తీర్పును ఇవ్వడం సంచలనం సృష్టించింది. దీంతో సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట లభించినట్లయ్యింది. ఈ కేసుకు సంబంధించి సరైన ఆధారాలను పోలీసులు సమర్పించకపోవడంతోనే వరంగల్ జిల్లా న్యాయస్థానం రాజయ్య కుటుంబాన్ని నిర్దోషులుగా ప్రకటించినట్లుగా తెలుస్తోంది.

More News

తెలంగాణ ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్ విడుదల.. షెడ్యూల్ ఇదే

తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ప్రకటించారు.

50 ప్లస్‌లో మరోసారి తండ్రి కాబోతోన్న దిల్‌రాజు.. ?

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు 50 ప్లస్ ఏజ్‌లో మరోసారి తండ్రి కానున్నారు.

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా కొత్త చిత్రం ప్రారంభం

యువ హీరో రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరో ప్రధాన పాత్రలో కొత్త చిత్రం ప్రారంభమైంది.

గ్యారంటీలేని బతుకులు.. అయినా ఓర్చుకుంటాం: ‘సినీ’ జీవితాలపై మెహ్రీన్ ఎమోషనల్ కామెంట్స్

రెండున్నర గంటల పాటు ప్రజలకు వినోదం పంచేందుకు సినీ తారలు ఎంతో శ్రమిస్తారు. ఒక సినిమా తయారవ్వడం వెనుక వందలాది మంది కృషి వుంటుంది.

48 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన హీరో ప్రశాంత్

పెళ్లి ఎవరి జీవితంలోనైనా అత్యంత కీలకమైనది. అనుకోని కారణాలు, మనస్పర్థల కారణంగా విడిపోయి ఒంటరిగా వున్నా ఓ తోడు కోసం తపించిపోయేవాళ్లు ఎందరో.