Nara Lokesh:టీడీపీ యువనేత నారా లోకేశ్‌కు హైకోర్టులో భారీ ఊరట.. స్కిల్ స్కాం కేసు క్లోజ్
Send us your feedback to audioarticles@vaarta.com
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఈనెల 12వరకు అరెస్ట్ చేయవద్దని ముందస్తు బెయిల్ గడువువ నేటితో ముగియడంతో హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సీఐడీ తరపు న్యాయవాదులు లోకేశ్‌ను ఈ కేసులో ముద్దాయిగా చూపలేదని.. దీంతో ఆయన్ను అరెస్ట్ చేయరని న్యాయమూర్తికి తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం లోకేశ్‌పై స్కిల్ స్కాం కేసులను కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయంతో లోకేశ్‌కు ఊరట లభించంగా.. టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఈనెల 17కు వాయిదా..
మరోవైపు ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 17కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విచారణ అక్టోబర్ 9న జరగగా.. నేటికి వాయిదా పడింది. నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన లోకేశ్..
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌ను సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించిన సంగతి తెలిసిందే. మంగళ, బుధవారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆయన్ను అధికారులు విచారించారు. ఈ కేసులో తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అడిగిన ప్రశ్నలే పదేపదే అడిగారని లోకేశ్ తెలిపారు. సీఐడీ విచారణ అనంతరం ఢిల్లీ వెళ్లిన లోకేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు ట్వీట్ చేశారు. సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తమ కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు షాకు వివరించినట్లు పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments