Chandrababu:చంద్రబాబుకు భారీ ఊరట.. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. దీంతో ఈ నెల 28న రాజమండ్రి జైలులో సరెండర్ కావాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుకు షరతులతో కూడిన మధ్యంతర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఈనెల 17న వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుతో టీడీపీ శ్రేణులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.
మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పైనా సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉంది. మరో రెండు రోజుల్లో తీర్పు రానుంది. దీంతో ఈ తీర్పు కూడా తమకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కేసులో అవినీతి చేశారని ఆరోపిస్తూ సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసింది. అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 52రోజల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గత నెల 31న హైకోర్టు ఆయనకు అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com