Avinash Reddy:వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డికి భారీ ఊరట

  • IndiaGlitz, [Friday,May 03 2024]

ఏపీ ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి వేసిన పిటీషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దస్తగిరి తరఫున ప్రముఖ న్యాయవాది, జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. అవినాష్ తరపును ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు దస్తగిరి పిటిషన్ కొట్టివేస్తూ.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కొనసాగుతుందని స్పష్టంచేసింది. దీంతో అవినాష్ కుటుంబానికి భారీ ఊరట లభించినట్లైంది.

ఇక ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ బెయిల్ పిటిషన్ల కొట్టేసింది. కాగా 2019 ఎన్నికల సమయంలో సంచలనం రేపిన వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి గతేడాది తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దస్తగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే వివేకా కుమార్తె కూడా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మరోవైపు కడప ఎంపీగా కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల పోటీ చేస్తుంటే.. వైసీపీ తరపున అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. వివేకా హత్య కేసు చూట్టే కడప జిల్లా రాజకీయాలు జరగుతున్నాయి.

More News

MLC Notification: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఓవైపు పార్లమెంట్ ఎన్నికల హడావిడి నడుస్తుంటే.. మరోవైపు వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Voters in AP: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఈ నియోజకవర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్..

ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని.. సర్వీస్ ఓటర్లు 65,707గా ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు.

ప్రధాని మోదీపై పోటీ చేస్తానంటున్న కమెడియన్.. ఎందుకో తెలుసా..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి సినీ, క్రీడా ప్రముఖులు కూడా పోటీ చేస్తున్నారు. మరోవైపు సామాన్యులు కూడా కీలక నేతలపై స్వతంత్ర

Sharmila: 'నవ సందేహాల' పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

సీఎం జగన్‌కు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 'నవ సందేహాల' పేరుతో మరో లేఖ రాశారు. బుధవారం ఎస్సీ, ఎస్టీల గురించి 9 ప్రశ్నలతో ఓ లేఖ రాయగా.. తాజా లేఖలో ఉద్యోగాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.

Kavitha:లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బెయిల్ కోసం మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.