విజయ్ దేవరకొండ తో భారీ నిర్మాణ సంస్థ చిత్రం..!
Monday, November 21, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవడే సుబ్రమణ్యం సినిమాలో తన నటనతో ఆకట్టుకుని...పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కమర్షియల్ సక్సెస్ సాధించి సంచలనం సృష్టించిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ద్వారక చిత్రంలో నటించారు. శ్రీనివాస రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...విజయ్ దేవరకొండతో భారీ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ ఓ మూవీ ప్లాన్ చేస్తుంది. ప్రజెంట్ హర్రర్ ట్రెండ్ నడుస్తుండడంతో సీనియర్ హీరోలు సైతం హర్రర్ మూవీస్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందుచేత విజయ్ దేవరకొండతో యు.వి. క్రియేషన్స్ హర్రర్ మూవీనే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఓ యువ దర్శకుడు తెరకెక్కించే ఈ చిత్రం పూర్తి వివరాలను త్వరలో ఎనౌన్స్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments