డిజిటల్ రంగంపై కన్నేసిన అగ్ర నిర్మాణ సంస్థ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో యువీ క్రియేషన్స్ ఒకటి. వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు ఈ బ్యానర్‌పై సినిమాలను రూపొందించే సంగతి తెలిసిందే. మిర్చి, రన్‌రాజారన్, మహానుభావుడు, భలేభలే మగాడివోయ్, భాగమతి, సాహో వంటి విజయంతమైన సినిమాల నిర్మాణం యువీ క్రియేషన్స్ నుండి వచ్చినవే. ఇప్పుడు మరికొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా ఇప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా డిజిటల్ కంటెంట్‌ను అందించాలని యువీ క్రియేషన్స్ ప్లాన్స్ చేస్తుందని వార్తలు వినపడుతున్నాయి.
సమాచారం మేరకు అగ్ర దర్శకులైన పూరీ జగన్నాథ్, శర్వానంద్‌తో రన్‌రాజారన్, ప్రభాస్‌తోసాహో వంటి సినిమాలు చేసిన సుజిత్‌ను యువీ సంస్థ కలిసి తమకు డిజిటల్ కంటెంట్‌ను అందించాలని కోరిందట. అయితే ప్రస్తుతం పూరి వరుస సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. సుజిత్ తదుపరి మెగాస్టార్ లూసిఫర్ సినిమాను రీమేక్ చేయాల్సి ఉంది. ఈ తరుణంలో వీరు డిజిటల్ కంటెంట్‌ను ఎలా అందిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఈ విషయమై క్లారిటీ రావాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. ఇప్పుడు టాలీవుడ్‌కి చెందిన చాలా మంది నిర్మాతలు డిజిటల్ కంటెంట్‌ను జనరేట్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout