మ‌రో కొరియ‌న్ రీమేక్‌పై క‌న్నేసిన అగ్ర నిర్మాత‌

  • IndiaGlitz, [Monday,January 13 2020]

వంద సినిమాల‌కు పైగా నిర్మించి భార‌త‌దేశంలోని అన్నీ భాష‌ల్లో సినిమాల‌ను నిర్మించిన నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌. నిర్మాణంలో 55 సంవ‌త్స‌రాల‌ను పూర్తి చేసుకుంది. రామానాయుడు త‌న‌యుడు ప్ర‌స్తుం నిర్మాణ సంస్థ వ్య‌వ‌హారాల‌ను ద‌గ్గ‌రుండి పర్య‌వేక్షిస్తున్నాడు. సురేష్‌బాబు భారీ చిత్రాల‌ను నిర్మించాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా మీడియం బ‌డ్జెట్ సినిమాలు చేస్తూ విజ‌యాల‌ను సొంతం చేసుకుంటున్నాడు. గ‌త ఏడాది కూడా ఈయ‌న నిర్మించిన ఓబేబీ చిత్రం, వెంకీ మామ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాల‌నే రాబట్టుకున్నాయి. ఇప్పుడు ఈయ‌న మ‌రో మీడియం బ‌డ్జెట్ సినిమాపై కన్నేశాడు. అది కూడా ఓ కొరియ‌న్ సినిమాకు రీమేక్‌గా.

కొరియ‌న్ విజ‌య‌వంత‌మైన 'మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్‌' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. స్వామిరారా, ర‌ణ‌రంగం చిత్రాల ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రంలో నివేథా థామ‌స్‌, రెజీనా క‌సండ్ర పోలీస్ ఆఫీస‌ర్స్ పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. వీరిద్ద‌రూ పోలీసులుగా న‌టిస్తోన్న తొలి చిత్ర‌మిది. స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని, పూర్త‌యిన త‌ర్వాత అధికారిక స‌మాచారం వ‌స్తుంద‌ని టాక్‌. ఓ బేబీ కూడా కొరియ‌న్ రీమేక్. ఆ సినిమా సాధించిన స‌క్సెస్‌తో సురేశ్ బాబు న‌మ్మ‌కంగా మ‌రో కొరియ‌న్ రీమేక్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

More News

డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్ - అల్లు అర్జున్

డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. అలాంటి మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రం గారికి థాంక్స్. ఇది మా హ్యాట్రిక్ కాంబినేషన్. నాకు అర్థమవుతోంది..

బంధుప్రీతిపై బ‌న్నీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ హీరోగా న‌టించిన `అల‌..వైకుంఠ‌పుర‌ములో` సంక్రాంతి సంద‌ర్భంగా

కల్యాణ్ రామ్ చెప్పడంతో మూవీ టైటిల్ మార్చిన డైరెక్టర్

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎంత మంచివాడ‌వురా’. ‘శతమానం భవతి’ చిత్రంతో

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌కు వైఎస్ జగన్ కీలక పదవి!?

ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆ చానెల్‌కు చైర్మన్‌గా ఉన్న థర్టీ ఇయర్స్ పృథ్వీ సరస సంభాషణ జరపడంతో ఆ వ్యవహారం చివరికి రాజీనామా దాకా వెళ్లిన సంగతి తెలిసిందే.

మీరెందుకు అలాంటి సినిమాలు చేయ‌రు అని అడిగారు: కల్యాణ్ రామ్

`అత‌నొక్క‌డే` నుండి `118` వ‌ర‌కు వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ల్యాణ్‌రామ్‌.