బాహుబలి 2 ఫస్ట్ లుక్ రిలీజ్ కు భారీ ఫ్లాన్..!
Monday, October 17, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించేందుకు బాహుబలి 2 రెడీ అవుతుంది. డిసెంబర్ కి షూటింగ్ పూర్తి చేసి ఏప్రిల్ 28న బాహుబలి 2 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల బాహుబలి 2 లోగోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (ఈనెల 23) సందర్భంగా ఈనెల 22న బాహుబలి 2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.
అయితే...బాహుబలి 2 ఫస్ట్ లుక్ ను హైదరాబాద్ లో కాకుండా ముంబైలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగమైన మూవీ మేళా అనే కార్యక్రమంలో ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట. ఈ కార్యక్రమానికి బాహుబలి 2 టీమ్ అంతా హాజరవుతారని తెలిసింది. ఆరోజు సాయంత్రం ఆన్ లైన్ లో బాహుబలి 2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments