నాని ‘వి’ సినిమాకు భారీ ఆఫ‌ర్‌.. నిర్మాత‌లు ఒప్పుకుంటారా?

  • IndiaGlitz, [Saturday,April 11 2020]

నేచురల్ స్టార్ నాని, మోహ‌నకృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘వి’. ఈ సినిమాలో నాని గ్రే షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించ‌గా..సుధీర్ బాబు అత‌న్ని ప‌ట్టుకోవాల‌నుకునే ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లు. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్స్‌. ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ సినిమా కరోనా ప్ర‌భావం కార‌ణంగా వాయిదా ప‌డింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గి ప్ర‌జ‌లు థియేట‌ర్స్‌కు వ‌చ్చే వ‌ర‌కు సినిమా రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ ఉండ‌క‌పోవ‌చ్చున‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం ‘వి’ సినిమా థియేట‌ర్స్ కంటే ముందు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోనే విడుద‌లవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌ముఖ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ‘వి’ సినిమాను త‌మ ఫ్లాట్‌ఫామ్‌లో విడుద‌ల చేస్తే దాదాపు రూ.35 కోట్లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసిందంటున్నారు. మ‌రి ఇందులో నిజా నిజాలేమిటో, ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. నాని న‌టిస్తోన్న 25వ చిత్ర‌మిది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండొచ్చున‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

More News

బన్నీ సినిమాలో బాలీవుడ్ విలన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘పుష్ప’. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తి .. త‌మ‌న్‌: బ‌న్నీ

బ‌న్నీ ఆనందానికి అవ‌ధులు లేవు. ఎప్ప‌టి నుండో ఎదురు చూసిన సాలిడ్ హిట్‌ను ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో సాధించేశాడు. బ‌న్నీ,

ఫేక్ న్యూస్‌పై స్పందించిన మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవి క‌రోనా వైర‌స్ పోరాటంలో భాగంగా త‌న వంతు సాయం చేస్తున్నార‌ని, అందులోభాగంగా త‌న స్నేహితుల‌తో క‌లిసి 700 మాస్కుల‌ను త‌యారు చేసి

రియ‌ల్ హీరోస్‌కు సెల్యూట్ : వెంక‌టేశ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి నుండి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డంలో డాక్ట‌ర్లు, పోలీసులు, ఇత‌ర ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. అహ‌ర్నిశ‌లు ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు.

అల్లు ఫ్యామిలీ, పవన్‌తో విబేధాలపై చిరు క్లారిటీ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ విషయాల్లో ఎక్కువగా పుకార్లు షికార్లు చేస్తుంటాయ్.