మహేశ్‌కు భారీ ఆఫర్....?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ లాక్డౌన్ సమయంలో పిల్లలతో సరదాగా సమయాన్ని గడుపతున్నారు. కరోనా ప్రభావం లేకుండా ఉండుంటే ఈపాటికే ఆయన 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ సినిమా సెట్స్‌పై ఉండేది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా దెబ్బకు ఇళ్లకే స్టార్స్ పరిమితం కావడం వారి ఆదాయానికి గండిపడ్డట్టే. కానీ మహేశ్ మాత్రం అందరికీ తాను భిన్నం అని రుజువు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కొన్ని బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తున్నాడట.
హీరోగానే కాకుండా ఏఎంబీ సినిమాస్‌లో మహేశ్ భాగస్వామిగా ఉన్నారు. పలు కమర్షియల్ యాడ్స్‌లో బిజీ బిజీగా నటిస్తున్నారు. కమర్షియల్ యాడ్స్‌కు పెద్దగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేకపోవడం కూడా ఓ ప్లస్ పాయింట్‌గా మారింది. ఇప్పుడు ఓ భారీ ఆఫర్‌ను మహేశ్ కమర్షియల్ యాడ్స్ రూపంలో అందుకన్నాడట. వివరాల్లోకెళ్తే రిలయన్స్ జియోకు మహేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నాడట. జియో బ్రాండ్‌ను తెలుగు ప్రేక్షకులకు రీచ్ చేయించడంలో మహేశ్ అయితే పక్కాగా సూట్ అవుతాడని రిలయన్స్ సంస్థ భావించి భారీ మొత్తంలో ఆఫర్ చేసి మహేశ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments