ఏప్రిల్‌లో పెద్ద సినిమాల సందడి
Send us your feedback to audioarticles@vaarta.com
2018 ఏప్రిల్.. తెలుగు సినిమా విషయంలో ఆసక్తికరంగా మారింది. మూడు పెద్ద ప్రాజెక్టులు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆర్డర్ సంగతి పక్కన పెడితే.. కింగ్ నాగార్జున, సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రాలు ఏప్రిల్‌లో విడుదల అయ్యే దిశగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే.. ఇటీవలే రాజుగారి గది2 లో మెంటలిస్ట్‌గా కనిపించి అలరించారు నాగార్జున. ఈ చిత్రం తరువాత శివ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్లో ఓ చిత్రం చేయనున్నారు. నవంబర్‌లో ప్రారంభమయ్యే ఈ సినిమా.. ఏప్రిల్‌లో విడుదల కాబోతుందని వర్మ ప్రకటించారు.
ఇక శ్రీమంతుడు తరువాత మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే కొత్త చిత్రం భరత్ అను నేను కూడా అదే నెలలో సందడి చేయనుంది. ఏప్రిల్ 20న ఈ సినిమా వచ్చే అవకాశముందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి కూడా. ఇక అల్లు అర్జున్ కొత్త చిత్రం నా పేరు సూర్య కూడా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి.. ఏప్రిల్ 2018 తెలుగు సినిమా పరంగా ఆసక్తిని కలిగిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments