మంత్రి సోమిరెడ్డికి ఘోర అవమానం!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది!. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే అధికారులతో సమావేశమవుతుండటంతో ఎన్నికల కమిషన్, ఏపీ సీఎస్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమిరెడ్డి మాత్రం ఏం చేసుకుంటారో చేస్కోండి అంటూ సమీక్షలు చేసి తీరుతానంటూ ఎన్నికల కమిషన్‌కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
మంగళవారం అనుకున్నట్లుగానే సోమిరెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి సంబంధిత శాఖ అధికారులు ఎవరూ హాజరుకాలేదు. సచివాలయానికి ఇవాళ ఉదయం 11 గంటలకే చేరుకున్న మంత్రి సోమిరెడ్డి... 3 గంటల పాటు వేచిచూసి చూసి తీవ్ర అవమానంతో తిరిగి వెళ్లిపోయారు.! కరువు, అకాల వర్షాలపై సమీక్ష తలపెట్టిన మంత్రి సోమిరెడ్డి.. అధికారులు, ఉద్యోగులు రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతటితో ఆగని ఆయన.. వెళ్తూ వెళ్తూ.. డిపార్ట్‌మెంట్ రివ్యూకు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని గతంలోనే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సోమిరెడ్డి ఈ రేంజ్‌లో హెచ్చరికలు జారీ చేసినా రాకపోవడంతో మంత్రి కంగుతిన్నారు. కాగా.. ఏప్రిల్ 30వ తేదీన సమీక్ష ఉంటుందని ఈ నెల 24వ తేదీనే అధికారులకు సోమిరెడ్డి పేషీ సమాచారం పంపించింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంత్రి సమీక్షకు అధికారులు, ఉద్యోగులు దూరంగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout