హైదరాబాద్‌లోనే పెద్ద సినీ పరిశ్రమ.. అండగా ఉంటాం: కేసీఆర్

తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. నేడు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కెఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

సినీ ప్రముఖులు కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని కేసీఆర్‌కు వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా? దేశంలో ముంబాయి, చెన్నైతో పాటు హైదరాబాద్‌లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉంది. లక్షలాది మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి దొరుకుతుంది. కోవిడ్ కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

ఇటు ప్రభుత్వం, అటు సినిమా పరిశ్రమ పెద్దలు కలిసి పరిశ్రమను కాపాడుకోవడానికి సంయుక్త ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వ పరంగా సినీ పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసే మానిఫెస్టోలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా.. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశమై, సినిమా పరిశ్రమ అభివృద్ధిపై మరింత విస్తృతంగా చర్చించాలని సినీ ప్రముఖులు నిర్ణయించారు.

More News

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో షూట్‌లో జాయిన్‌ అయిన  హాలీవుడ్‌ స్టార్స్‌

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో

నాని ‘శ్యామ్ సింగరాయ్’ స్టోరీ ఇదేనట...

నేచురల్ స్టార్ నాని లాక్‌డౌన్ తర్వాత మరింత స్పీడ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుని షూటింగ్‌లు కానిచ్చేస్తున్నాడు.

వారిని మెప్పించిన పార్టీకే జీహెచ్ఎంసీ పీఠం!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.

కరోనాకు వ్యాక్సిన్‌ వస్తుందో రాదో తెలీదుగానీ., ఖ‌చ్చితంగా ఎఫ్‌ 3తో నవ్వుల వ్యాక్సిన్ వ‌స్తుంది - డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి

ఇప్పుడు ఇండస్ట్రీలో, ఆడియెన్స్‌లో ఈ పేరుకి ఓ ప్రత్యేకమైన వేల్యూ ఉంది. పటాస్‌.. సుప్రీమ్‌.. రాజాదిగ్రేట్‌.. ఎఫ్‌2... సరిలేరు నీకెవ్వరు ఇలా ఒకటి కాదు రెండు కాదు.

‘శ‌శిక‌ళ’ బ‌యోపిక్‌పై ఆర్జీవీ అప్‌డేట్‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ వ‌రుస  సినిమాల‌ను అనౌన్స్ చేస్తూ.. వాటిని పూర్తి చేస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడు.