నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన దుకాణాలు

  • IndiaGlitz, [Wednesday,January 30 2019]

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం థాటికి గ్రౌండ్‌‌లో ఉన్న పలు దుకాణాల్లో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతుండటంతో షాపుల్లో పనిచేసే వ్యక్తులు, సందర్శకులు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో పలు షాపులు దగ్ధమవ్వగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ నుమాయిష్ జరుగుతుండటంతో పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు.

స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైరింగ్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మంటలు థాటికి జనాలు ఎక్కడికక్కడ పరుగులు తీస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు పొగ.. మరోవైపు మంటలు.. ఇంకో వైపు జనాల పరుగులతో తొక్కిసలాటతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భయానక వాతావరణం నెలకొంది. అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పాటు కమిషనర్ దానకిశోర్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కాగా అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది..? షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందా..? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా..? ఆస్తి, ప్రాణ నష్టం ఎంత వాటిల్లింది? అనే విషయాలు తెలియరాలేదు. మొదట ఒక షాపులో అగ్నిప్రమాదం జరగడంతో ఆ మంటలు పక్కనే ఉన్న షాపు అంటుకోవడం ఇలా సుమారు పదుల సంఖ్యలో షాపులో దగ్ధమైనట్లు తెలుస్తోంది. కాగా ఈ నుమాయిష్ జరిగేటప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ దుకాణాలు రన్ చేస్తుంటారు. ఈ అగ్నిప్రమాదంతో భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More News

అనంతకు 'కియా' తెచ్చిన ఘనత మోదీదే.. ఇదిగో ఆధారాలు!

అనంతకు ‘కియా’ రాకతో నవ్యాంధ్రకు పారిశ్రామిక కళ వచ్చింది..! ‘కియా’ రాక ఓ చరిత్ర..! కరువు జిల్లా అనంతపురం ఇక ఉద్యోగులతో కలకలాడుతుందని అందరూ చెప్పుకుంటున్నారు

కడప జిల్లాలో కేసీఆర్ ఎన్నికల సర్వే..!?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచుకోట అయిన కడప జిల్లాలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల సర్వే నిర్వహించారా..?

హీరోయిన్ల పై సింగర్ ఎస్పీ బాలు బోల్డ్ కామెంట్స్

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హీరోయిన్స్‌‌పై బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ మాటలు విన్న సినీ ప్రియులు, నటీనటులు సైతం ఒకింత అవాక్కయ్యారు.

రాజ్‌త‌రుణ్‌ దగ్గరకి మహేష్ మేనల్లుడి కథ...

ప్రతి మెతుకు మీదా తినేవాడి పేరు రాసిపెట్టి ఉంటుందని తెలుగులో సామెత. అలాగే, ప్రతి కథ మీదా ఎవరు నటించాలో రాసి భగవంతుడు రాసి పెడతాడు అనుకోవాలి.

'4 లెటర్స్‌' ఆడియో!

ఈశ్వర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ, శ్రీ చక్ర క్రియేషన్స్‌ పతాకంపై దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ నిర్మించిన సినిమా ‘4 లెటర్స్‌’.