నాగార్జున 'వైల్డ్ డాగ్'కు భారీ డీల్.. థియేటర్స్‌కు షాక్..!
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున టైటిల్ పాత్రలోనటిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్'. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కోవిడ్ ప్రభావ నేపథ్యంలో యాబై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చునని ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. ఇప్పటికే సోలోబ్రతుకే సోబెటర్, ఒరేయ్ బుజ్జిగా, వి వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఓ భారీ స్టార్ సినిమా విడుదలైతే బావుంటుందని థియేటర్స్ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున 'వైల్డ్ డాగ్' విషయంలో థియేటర్స్‌కు నిర్మాతలు షాకిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు జనవరి 26న వైల్డ్ డాగ్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు డీల్ చేసుకున్నారట.
ఇండస్ట్రీ వర్గాల మేరకు ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం నిర్మాతలకు నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 27 కోట్ల చెల్లించిందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగార్జున వినయ్ వర్మ అనే ఎన్‌ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. షూటింగ్‌లకు అనుమతలు వచ్చిన కోవిడ్ పరిస్థితుల్లోనూ నాగార్జున అండ్ టీం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొని పూర్తి చేశారు. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదలైతే థియేటర్స్ వర్గాలకు కాస్త షాకింగ్ విషయమే. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments