కేజీయ‌ఫ్ 2కు భారీ డీల్‌

  • IndiaGlitz, [Wednesday,May 06 2020]

దక్షిణాది సినిమాల‌కు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన సినిమాల్లో బాహులి ముందు వ‌రుస‌లో ఉంటే ఆ క్రేజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లిన సినిమా కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1. ఇప్పుడు కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2పై భారీ అంచనాలున్నాయి. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో సంజ‌య్ ద‌త్‌, ర‌వీనాటాండ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. సినిమాను ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. అయితే క‌రోనా ప్ర‌భావంతో తుది ద‌శ షూటింగ్ ఆగింది.

అయితే సినిమాపై క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు భారీ డిజిట‌ల్ డీల్ వ‌చ్చింద‌ట‌. తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ వెర్ష‌న్స్ అన్నింటికీ క‌లిపి ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైజ్ రూ.55 కోట్ల డీల్ ప్ర‌పోజ‌ల్‌ను పెట్టింద‌ట‌. అయితే ఈ వ్య‌వ‌హారంపై నిర్మాత‌లు ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేద‌ని అంటున్నారు. మ‌రి రాఖీభాయ్‌గా య‌ష్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో తెలియాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత షూటింగ్‌ను పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది విడుద‌ల చేస్తారో లేక వ‌చ్చే ఏడాది విడుద‌ల చేస్తారో తెలియాలంటే వేచి చూడ‌క త‌ప్పేలా లేదు.

More News

ప్రొఫెష‌న‌ల్ బాక్స‌ర్ వ‌ద్ద చ‌ర‌ణ్ ట్రైనింగ్‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం తార‌క్‌తో క‌లిసి రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం (ఆర్ఆర్ఆర్)’ చిత్రంలో హీరో్యిన్‌గా న‌టిస్తోన్న

తెలుగు నేర్చుకుంటున్న హీరోయిన్‌

ఉత్త‌రాది భామ‌లు ద‌క్షిణాది సినిమాల్లో త‌మ హ‌వా చాటుతున్నారు. ఇప్పుడు ఉత్త‌రాది హీరోయిన్స్ కేవ‌లం అలా వ‌చ్చి సినిమాలు చేసి పోవ‌డ‌మే కాకుండా ఇక్క‌డి వారికి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కేంద్రం తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం.. ఏంటిది ఎందుకిలా చేస్తోందో..!?

కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే టికెట్లపై నగదు వసూలు చేయడం, కరెంట్ తమ ఆధీనంలోకి తీసుకుంటామనే విషయాలపై కేసీఆర్ ఒకింత సీరియస్ అయ్యారు.

15 తర్వాత తెలంగాణలో ఆర్టీసీ నడుస్తుంది : కేసీఆర్

తెలంగాణలో 15 తర్వాత ఆర్టీసీ నడుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆటోలు, క్యాబ్‌లకు గ్రీన్ జోన్లలో మాత్రం పూర్తిగా అవకాశం ఉంటుందన్నారు.

తెలంగాణలో అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు : కేసీఆర్

తెలంగాణలోని మందుబాబులకు సీఎం కేసీఆర్ తియ్యటి శుభవార్త చెప్పారు. రేపట్నుంచే అనగా బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపులను తెరుస్తున్నట్లు మీడియా